My title

బ్రహ్మాండంగా మొదలైన శాతకర్ణి జైత్రయాత్ర

ఓవైపు ఖైదీ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమాకు అక్కడక్కడ నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ… థియేటర్లు హౌజ్ ఫుల్ అయిపోతున్నాయి. కలెక్షన్లు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఏమాత్రం టైం గ్యాప్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన బాలయ్య… తన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ఆడియన్స్ అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. అద్భుతమైన స్టోరీలైన్, కళ్లుతిప్పుకోనివ్వని టేకింగ్ తో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తొలిరోజు అదిరిపోయే టాక్ తో మొదలైంది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ సినిమా టిక్కెట్లను ఫ్యాన్సీ రేట్లకు దక్కించుకున్నారు అభిమానులు. మరోవైపు కంటెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా మంచి మార్కులు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సాయిమాధవ్ బుర్రా డైలాగులు, చిరాాంతన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్రిష్ ఫిలిం మేకింగ్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాయి. ఇప్పటికే ఎన్నో పౌరాాణిక పాత్రల్లో మెప్పించిన బాలయ్య… గౌతమీపుత్ర శాతకర్ణిగా కూడా అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + sixteen =