My title

బాహు… బలవుతున్నాడు!

ప్రతి చోటా బాహుబలి అంటే చాలా క్రేజ్ ఉంది. కానీ.. ఒక్క కర్ణాటకలోనే.. కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కారణంగా.. ఈ బాహుబలి 2 సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావేరీ జలాల విషయంలో.. తమిళనాడుకు మద్దతుగా కామెంట్లు చేశారన్న ఆరోపణలతో.. కర్ణాటక రక్షణ వేదిక.. ఈ సినిమాను కన్నడలో విడుదలను అడ్డుకుని తీరతామని స్పష్టం చేస్తోంది..

అలా వార్నింగ్ ఇవ్వడమే కాదు.. సత్యరాజ్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ.. తగలబెడుతూ.. రకరకాలుగా కర్ణాటక రక్షణ వేదిక నిరసనలు వ్యక్తం చేస్తోంది. బాహుబలిని విడుదల చేయాలని చూస్తే.. ఇంకా ఆందోళనలు పెరుగుతాయని కూడా హెచ్చరిస్తోంది…

బాహుబలి కన్ క్లూజన్ లాంటి భారీ అంచనాలున్న సినిమా.. ఏ భాషలో విడుదల కాకపోయినా సరే.. కోట్ల రూపాయల విలువైన మార్కెట్ చేజారినట్టే. అందుకే.. విడుదల తేదీ దగ్గరపడుతున్నాకొద్దీ.. రాజమౌళి క్యాంప్ లో కర్ణాటక గొడవలు వర్రీ పెంచుతున్నాయి.