My title

“బాహుబలి” ప్రొడ్యూసర్స్ కి హ్యాండ్ ఇచ్చిన శర్వానంద్

“మహానుభావుడు” తో క్లీన్ హిట్ ని అందుకొని ఆ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు శర్వానంద్. అయితే ఈ శర్వానంద్ తన తదుపరి మూవీని “స్వామి రా రా” “కేశవ” డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ తో చేస్తున్నాను అని ఆల్రెడీ ప్రకటించేసాడు. ఈ మూవీ తో పాటు శర్వా రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సింది. “బాహుబలి” నిర్మాతలు శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ ఆగిపోయిందిట. అవును మొన్నటి వరకు ప్రీ-ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ మూవీ ప్రెసెంట్ ఆగిపోయింది అనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుకుతున్నాయి.

అయితే ఈ మూవీ ఎందుకు ఆగిందన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. “బాహుబలి” నిర్మాతలు చేయబోయే తర్వాతి సినిమా అంటూ దీనిపై జనాల్లో బాగానే ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా ప్రకాష్ “అనగనగా ఒక ధీరుడు” “సైజ్ జీరో” లాంటి డిజాస్టర్లు తీసినప్పటికీ “బాహుబలి” నిర్మాతలు ప్రకాష్ మీద నమ్మకం పెట్టడం కూడా ఆసక్తి రేకెత్తించింది. అయితే ప్రకాష్ ట్రాక్ రికార్డు చూసిన జనాలు కూడా శర్వా ఈ సినిమా చేయకపోవడమే మంచిదైందని అంటున్నారు.

ఇదిలా ఉంటే శర్వానంద్ “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా తో మూవీ చేయడానికే “బాహుబలి” ప్రొడ్యూసర్స్ కి హ్యాండ్ ఇచ్చాడు అని అంటున్నారు కొంత మంది. మరి అసలు ఈ మూవీ ఎందుకు ఆగిపోయింది, ఈ మూవీ పై శర్వా ఎందుకు ఆసక్తి చూపియడం లేదు అనే విషయాలు తెలియాలి అంటే “బాహుబలి” ప్రొడ్యూసర్స్ నోరు విపల్సిందే.