My title

పవన్ ను కాపీ కొడితే తప్పేంటి..

నితిన్ ఎదురు ప్రశ్న ఇది. పవన్ ను కాపీ కొట్టడమే కాదు. తన రాబోయే సినిమాల్లో కూడా పవన్ రిఫరెన్స్ కచ్చితంగా ఉంటుందంటున్నాడు ఈ హీరో. లై మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నితిన్ ఈ విషయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు.

“నేను చిన్నప్పట్నుంచి పవన్ సినిమాలు చూసి పెరిగాను. అతనిలా ప్రవర్తించేవాడిని. పవన్ అంటే నాకు చాలా ఇష్టం. సో.. నా సినిమాల్లో, నా నటనలో పవన్ సినిమాలు, నటన అక్కడక్కడ కనిపించడం సహజం. అది కావాలని పెట్టింది కాదు. కొన్ని సందర్భాల్లో నాలో ఉన్న పవనిజం అలా బయటపడిపోతూ ఉంటుంది”. పవన్ ను కాపీ కొట్టడంపై నితిన్ వివరణ ఇది.

ఇక లై సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో కూడా పవన్ ను కాపీకొట్టానంటున్నాడు నితిన్. అమెరికాలో తీసిన ఓ పాటలో పవన్ నటించిన తమ్ముడు సినిమాలోని ఓ పాటను కాపీ కొట్టామంటున్నాడు. హే పిల్ల నీ పేరు లవ్లీ అనే పాటలో పవన్ గెటప్ ఎలా ఉంటుందో.. లై లో ఓ పాటలో తన గెటప్ కూడా అలానే ఉంటుందంటున్నాడు.