My title

నాని సినిమాకు రాజమౌళి ప్రచారం

సాధారణంగా సినిమా బాగుంటే ట్వీట్ చేయడం రాజమౌళికి అలవాటు. అక్కడితో విషయం  అగిపోతుంది. కానీ ఇక్కడున్నది నాని సినిమా. అందుకే రాజమౌళి ఇంకాస్త ఎగ్జైట్ అయ్యాడు. నిన్నుకోరి సినిమా ట్రయిలర్ బాగుందని మెచ్చుకుంటూనే, ప్రస్తుతం నాని కెరీర్ లో రైజింగ్ లో ఉందంటూ మెచ్చుకున్నాడు. నాని ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉన్నాడని పొగుడుతూ ట్వీట్ చేశాడు.

నాని-నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు నిన్నుకోరి సినిమాలో. ఇందులో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. సినిమా ట్రయిలర్ చాలా క్లాసీగా ఉందని మెచ్చుకున్నాడు రాజమౌళి.

దీనికి నాని కూడా రియాక్ట్ అయ్యాడు. రాజమౌళి ప్రశంసతో తమ సినిమా ఇప్పటికే సగం సక్సెస్ అందుకుందని మురిసిపోయాడు. ఈ సినిమాకు సంబంధించి ఈనెల 29న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటుచేస్తున్నారు. వచ్చేనెల 7న సినిమాను విడుదల చేయబోతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు.