My title

నాకు మరోదారి లేదు- సీఎంతో శిల్పా

టీడీపీ నాయకత్వానికి నంద్యాల ఉప ఎన్నిక తలనొప్పిగా మారింది. పోటీపై శిల్పా మోహన్ రెడ్డి వెనక్కు తగ్గడం లేదు. తాను పోటీ చేసి తీరుతామని ముఖ్యమంత్రితోనే చెప్పారు. మీ సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డికి మండలి చైర్మన్‌ పదవి ఇస్తున్నామని కాబట్టి పార్టీకి సహకరించాలని శిల్పామోహన్‌ రెడ్డిని చంద్రబాబు కోరారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. శిల్పా చక్రపాణిరెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇచ్చినా… స్థానికంగా తన అనుచరగణాన్ని కాపాడుకోవడం కోసం పోటీ చేయడం తప్ప తనకు మరోదారి లేదని శిల్పా తేల్చేశారు.

పార్టీ టికెట్ కేటాయిస్తే గెలిచి వస్తానని చెప్పారు. శిల్పామోహన్ రెడ్డి వెనక్కు తగ్గకపోవడంతో చంద్రబాబు… రెండుమూడు రోజులు ఆగాక నిర్ణయం తీసుకుందామని శిల్పా బ్రదర్స్‌తో భేటీని ముగించేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన శిల్పామోహన్ రెడ్డి… తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వందశాతం ఖాయమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తనకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం ఉందన్నారు.