My title

తొలి రోజు నుంచే ఖైదీ ప్రకంపనలు ప్రారంభం

ఖైదీ సినిమా ఇలా థియేటర్లలోకి వచ్చిందో లేదో అప్పుడే ఈ సినిమా ప్రభంజనం షరూ అయింది. అల్టిమేట్ మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి… పదేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వస్తున్నాడంటేనే ఆటోమేటిగ్గా ఎటెన్షన్ క్రియేట్ అవుతుంది. దీంతో మ్యాగ్జిమమ్ థియేటర్లు ఈ సినిమాకే దక్కాయి. అయితే సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ అనుకున్నంతగా లేకపోయినప్పటికీ… వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. తొలి రోజే ఈ మూవీ ఓవర్సీస్ లో మిలియిన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైపోయింది.

తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు బాహుబలి మినహా మరే సినిమాకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. బాహుబలి సినిమా విడుదలైన మొదటి రోజే ఓవర్సీస్ లో 1.44 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు ఖైదీ కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు లక్షా 33వేల డాలర్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే.. తుది లెక్కలు తేలేసరికి బాహుబలి రికార్డును చిరంజీవి క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు అమెరికాాలో భారీ స్థాయిలో విడుదలైన తెలుగు సినిమాగా కూడా ఖైదీ నంబర్-150 రికార్డు సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × four =