My title

డీజే.. ఓ పెద్ద ల్యాండ్ మాఫియా..

 

ఈ వీకెండ్ వస్తున్న ఒకే ఒక్క సినిమా దువ్వాడ జగన్నాథమ్-డీజే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హరీష్ శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ, బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. మరో గెటప్ ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. అప్పుడప్పుడు సూట్స్ లో కనిపిస్తున్నాడు, పైట్స్ చేస్తున్నాడు. కానీ ఆ క్యారెక్టర్ ఏంటనేది మాత్రం అంతుచిక్కలేదు.

 

ఎట్టకేలకు డీజే విడుదలకు సరిగ్గా 4 రోజుల ముందు స్టోరీలైన్ బయటకొచ్చింది. అతిపెద్ద ల్యాండ్ మాఫియా నేపథ్యంలో డీజే సినిమా నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. సామాన్యులంతా ల్యాండ్ మాఫియాలో చిక్కుకొని ఇబ్బందిపడుతుంటే.. వాళ్లను రక్షించడంతో పాటు మాఫియా అంతు చూస్తాడట డీజే.

 

ప్రస్తుతానికైతే స్టోరీలైన్ ఇంతే. కాకపోతే పౌరోహిత్యం చేసుకునే జగన్నాథమ్.. డీజేగా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయం మాత్రం సినిమాకే పెద్ద ట్విస్ట్ అంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, ఈ కథను ప్రత్యేకంగా బన్నీ కోసమే రాశాడట.