My title

ఘాజి ట్రయిలర్ రివ్యూ

ఓవైపు చిరంజీవి సినిమా దుమ్ముదులుపుతోంది. మరోవైపు ఇంకొన్ని గంటల్లో బాలయ్య ప్రతిష్టాత్మక వందో సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఇలాాంటి టఫ్ టైమ్స్ లో కూడా జనాల్ని తనవైపు తిప్పుకున్నాడు దగ్గుబాటి రానా. మొన్నటివరకు భళ్లాలదేవుడిగా మాత్రమే కనిపించిన ఈ ఆరడుగుల ఆజానుబాహుడు.. తాాజాగాా ఘాజి సినిమాతో సిద్ధమయ్యాడు. మోషన్ మోస్టర్ తో ఇప్పటికే సంథింగ్ స్పెషల్ అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ట్రయలర్ తో హంగామా చేస్తోంది.

ఇండో-పాక్ యుద్ధం కంటే ముందు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా సినిమాలో కీలకమైన సన్నివేశాలన్నీ అండర్ వాటర్ లో.. అంటే సముద్ర గర్భంలో జరిగినట్టు చూపించారు. జలాంతర్గాములు, టాార్పెడోలు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు.. ఇలాంటి సరంజామాతో ఓ తెలుగు సినిమా చేయడం సాహసమే. కానీ అలాంటి సాహసం చేయడానికి రెడీ అయ్యాడు నిర్మాత పీవీపీ. రిస్క్ తగ్గించేందుకు ఒకేసారి తెలుగు,, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. యూనిట్ నమ్మకం వమ్ముపోలేదు. ఘాజీ మూవీ ట్రయిలర్ చాలా బాాగా వచ్చింది. సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మరీ ముఖ్యంగా నేవీ కమాండర్ గా రానా లుక్ ఆడియన్స్ కు రీఫ్రెషింగ్ గా అనిపించింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చివర్లో రానా చెప్పిన డైలాగ్.. ట్రయిలర్ ను పీక్స్ కు తీసుకెళ్లాయి. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను కచ్చితంగా బిగ్ స్క్రీన్ లో చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 11 =