My title

గురు టీజర్ రివ్యూ…

అదేంటో.. చేసేవి రీమేక్ సినిమాలే అయినప్పటికీ అవి కేవలం వెంకీకే సూట్ అవుతాాయేమో అన్నట్టు ఉంటాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే టాలీవుడ్ లో రీమేక్ రాజాగా పేరుతెచ్చుకున్న విక్టరీ వెంకటేశ్.. తాజాగా గురు సినిమాతో రెడీ అవుతున్నాడు. కుదిరితే ఈనెలాఖరుకు విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా టీజర్ ట్రయిలర్ ను తాాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ చూస్తే వెంకటేశ్ డెడికేషన్, అతడి సినిమాల ఎంపిక ఏంటనే విషయం అర్థమౌతుంది.

నిజంగా రీమేకే అయినప్పటికీ.. గురు టీజర్ అదిరిపోయింది. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వెంకీ బైక్ మీద వస్తున్న షాట్ తో స్టార్ట్ అయింది టీజర్. ఇక అక్కడ్నుంచి 40 సెకెన్ల పాటు కన్నార్పడం మరిచిపోతాాం. ఇప్పటికే హిట్ అయిన సాలా ఖడూస్ సినిమాకు రీమేక్ గా గురు సినిమా వస్తోంది. అయితే ఇది రీమేక్ అనే విషయాన్ని మరిచిపోయేలా వెంకీ ఇందులో కనిపించాడు… నటించాడు… జీవించాడు.

ఒరిజిన్ వెర్షన్ డైరక్ట్ చేసినే సుధా కొంగర.. గురు సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఒరిజినల్ కు పనిచేసిన టీం అంతా గురు సినిమాకు కూడా పనిచేసింది. రితికా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. వై-నాట్ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − 6 =