My title

గుంటూరోడు ట్రయిలర్ రివ్యూ – బాగుంది బట్ రొటీన్..

లాస్ట్ ఇయర్ రెండు ఫ్లాపులు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. సో.. ఈసారి ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తాడేమో అని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ గుంటూరోడు ట్రయిలర్ మాత్రం రొటీన్ గానే ఉంది. బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. సో.. ఈసారి ఈ మంచువారి చిన్నోడ్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా మనోజ్ ఈసారి రాజేంద్రప్రసాద్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టును, ప్రగ్యా జైశ్వాల్ లాంటి ముద్దుగుమ్మను కూడా తోడుతెచ్చుకున్నాడు. ఇక ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు గుంటూరోడు ట్రయిలర్ పక్కా మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. సన్నివేశాలు, లొకేషన్లు కొత్తగా అనిపించకపోయినప్పటికీ… మైండ్ ఈ లోకం నుంచి డిస్-కనెక్ట్ అయిపోయింది. భూమ్మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాల్సిందే.. సత్తా ఉన్నోడ్ని చూస్తే చావుకి కూడా పడిపోద్ది లాంటి డైలాాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా గుంటూరోడు సినిమా ట్రయిలర్.. టైటిల్ కు తగ్గట్టే గుంటూరు మిర్చిలా యమ ఘాటుగా ఉంది. ఇన్నాళ్లూ క్యూట్ గా, సంప్రదాయబద్ధంగా కనిపించిన ప్రగ్యా జైశ్వాల్, ఈ మాస్ మూవీలో ఎలా కనిపిస్తుందా అనే క్యూరియాసిటీ కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 2 =