My title

కొత్త సినిమా టైటిల్స్ వచ్చేశాయ్….

టాలీవుడ్ లో సినిమా కొత్తగా ఉండకపోయినా టైటిల్ మాత్రం కచ్చితంగా కొత్తగా, క్యాచీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆడియన్స్ మూవీకి ఎట్రాక్ట్ అవుతారు. ఈసారి కూడా అలాంటి కొత్త టైటిల్స్ వచ్చేశాయి. పనిలోపనిగా ఇప్పటివరకు ఉన్న పుకార్లకుే ఓ క్లారిటీ కూడా వచ్చేసినట్టయింది.

పవన్-త్రివిక్రమ్ సినిమాకు మొన్నటివరకు చాలా టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే పేరు ఫిక్స్ చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. మరోవైపు వరుణ్ తేజ్ కొత్త సినిమాకు పవన్ గతంలో నటించిన తొలిప్రేమ టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడు.

అటు దిల్ రాజు కూడా దాగుడు మూతలు అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. హరీష్ శంకర్ రాసుకున్న ఓ మల్టీస్టారర్ కథ కోసం ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. దర్శకుడు సంపత్ నంది కూడా తన సొంత బ్యానర్ పై సీటీమార్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇక అభిషేక్ పిక్చర్స్ వాళ్లు విటమిన్-ఎమ్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మాతలు నేను నా దిల్, ఆనందో బ్రహ్మ లాంటి హిట్ బొమ్మ తీసిన 70 ఎమ్ఎమ్ నిర్మాతలు యాత్ర అనే టైటిల్స్ రిజిస్టర్ చేయించారు.