My title

కేవలం ఆడియో కోసం 12 కోట్లు

ఇంత బడ్జెట్ ఉంటే.. తెలుగులో ఆనందో బ్రహ్మ లాంటి హిట్ సినిమాలు 4 తీయొచ్చు. అలా 4 సినిమాలకు పెట్టాల్సిన పెట్టుబడికి జస్ట్ ఒక ఆడియో ఫంక్షన్ కోసం పెడుతున్నారు. ఇలా 2.0 సినిమా ఆడియో ఫంక్షన్ ను  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో నిర్వహించబోతున్న ఈ ఆడియో ఫంక్షన్ కోసం నిర్మాతలు ఏకంగా 12 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారు.

450 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతున్న 2.0 సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం షురూ అయింది. వివిధ దేశాల్లో హాట్ ఎయిర్ బెలూన్లు ఎగరేసే కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా త్రీడీ మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ తో బజ్ ను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. రెహ్మాన్ స్వరపరిచిన ఈ సినిమా పాటల్ని ఈనెల 27న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

ఆడియో ఫంక్షన్ తర్వాత హైదరాబాద్ లో టీజర్ ను, చెన్నైలో ట్రయిలర్ ను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇలా దశలవారీగా సినిమాకు ప్రచారం కల్పించి… వచ్చే ఏడాది జనవరి 25న 2.0ను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. రజనీకాంత్, ఎమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్  దర్శకుడు.