My title

“కర్ణ” గా బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసి మంచి జోరు మీద ఉన్నాడు. దాంట్లో “గౌతమి పుత్ర శాతకర్ణి” అనే మూవీ బాగానే ఆడిన కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన “పైసా వసూల్” మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాని బాలయ్య మాత్రం తన సినిమాల జోరుని తగ్గించకుండా  తన 102వ సినిమాను కూడా చేసేస్తున్నాడు. ప్రముఖ తమిళ డైరక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో బాలయ్య ఒక సినిమాని స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీకి ”కర్ణ” అనే పవర్ ఫుల్ టైటిల్ ని మూవీ యూనిట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ  టైటిల్ ఆల్రెడీ వేరొకరి దగ్గర ఉండటంతో ”NBK కర్ణ” అంటూ ఈ మూవీ కి టైటిల్ ని పెట్టాలని ఫిక్స్ అయ్యారట దర్శక నిర్మాతలు. మరి ఈ టైటిల్ ఎంత వరకు అఫీషియల్ అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ టైటిల్ గురించి టాక్ బయటకి రాగానే నందమూరి ఫాన్స్ అందరూ బాలకృష్ణ కి ఇది కరెక్ట్ టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు.