My title

అభిమానుల నుంచి చెర్రీకి.. స్వీట్ గిఫ్ట్

సుకుమార్ తో చేస్తున్న సినిమా సందర్భంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు.. మెగా ఫ్యాన్స్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. రీసెంట్ గా కొల్లూరుకు షిఫ్ట్ అయ్యింది.

అక్కడ జనానికి ముందే.. ఎలాంటి అనుమతి ఉండదని దర్శకుడు సుకుమార్ తేల్చి చెప్పాడట. ఆయన చెప్పినపుడు సరే అన్న ఫ్యాన్స్ అంతా.. తీరా చెర్రీ వచ్చేసరికి బొమ్మ చూపించారట.

ఊహించని స్థాయిలో ఇచ్చిన గ్రాండ్ వెల్ కమ్ కు.. రామ్ చరణ్ కూడా ఫుల్ దిల్ ఖుష్ అయ్యాడట. ఈ విషయాన్ని చెర్రీ నేరుగా చెప్పకపోయినా.. ఆయన భార్య ఉపాసన కామినేని.. అందరితో షేర్ చేసుకుంది. కొల్లూరు అందాలను ఆస్వాదిస్తున్నామని.. స్వాగతం చాలా బాగుందని సోషల్ సైట్లలో ఫొటో పెట్టి కామెంట్ చేసింది