Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

అదే రోజున తుమ్మల కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆలోపు షర్మిల వ్యవహారం, పాలేరు అభ్యర్థిత్వం, లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపై స్పష్టత వస్తుందని తుమ్మల భావిస్తున్నారు.

కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
X

కాంగ్రెస్‌లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. తుమ్మల బుధవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని ఇప్పటివరకూ ప్రచారం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. తుమ్మల జాతక రీత్యా 6వ‌ తేదీన కలిసిరాదని పండితులు సూచించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తన చేరికను వాయిదా వేయాలని తుమ్మల కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీంతో తుమ్మల చేరిక కార్యక్రమాన్ని ఈ నెల 17కు వాయిదా వేశారని సమాచారం.

రాహుల్‌ యూరప్ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన తర్వాత తెలంగాణలో రెండు రోజుల పాటు CWC సమావేశాలు జరగనున్నాయి. 17వ‌ తేదీన తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బహిరంగసభకు ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే సహా పార్టీ అగ్రనేతలు హాజరవుతారు. అదే రోజున తుమ్మల కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆలోపు షర్మిల వ్యవహారం, పాలేరు అభ్యర్థిత్వం, లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపై స్పష్టత వస్తుందని తుమ్మల భావిస్తున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి పాలేరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు తుమ్మల. ఈ నేపథ్యంలో ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, పలువురు సీనియర్ నేతలు తుమ్మల ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. వీరి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన తుమ్మల.. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సైతం తుమ్మలతో భేటీ అయ్యారు.

*

First Published:  5 Sep 2023 7:21 AM GMT
Next Story