Telugu Global
Telangana

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే అర్హత వారికి ఇక లేదు..

37మందిని భవిష్యత్తులో జరిగే పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తూ నిర్ణయం తీసుకుంది TSPSC. తమ నిర్ణయంపై ఆ 37మందిలో ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండురోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే అర్హత వారికి ఇక లేదు..
X

ఆ 37మంది TSPSC నిర్వహించే ఎలాంటి పోటీ పరీక్షలకు హాజరు కాలేరు. వారికి ఆ అర్హత లేకుండా డీబార్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారంతా పేపర్ లీకేజీ కేసులో నిందితులు. ఇప్పటికే వారిని అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. విచారణ చేపట్టింది. శిక్ష ఖరారు కాకముందే TSPSC నిందితుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది.

రెండురోజుల్లో వివరణ ఇవ్వాలి..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అవుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 43కి చేరింది. మరింతమందికి ఇందులో భాగస్వామ్యం ఉంటుందనే అనుమానాలున్నాయి. 44 మందిపై కేసు నమోదు చేసిన సిట్ 43 మందిని అరెస్టు చేసింది. వీరిలో 37మందిని భవిష్యత్తులో జరిగే పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తూ నిర్ణయం తీసుకుంది TSPSC. తమ నిర్ణయంపై ఆ 37మందిలో ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండురోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.

మరోవైపు కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్ చార్జిగా ఉన్న శంకర లక్ష్మి పాత్రపై కూడా సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. కాన్ఫిడెన్షియల్ విభాగం లోనే ప్రశ్నాపత్రాలు భద్రపరిచే సర్వర్ ఉంటుంది. దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌ వర్డ్స్ ఆమె దగ్గరే ఉంటాయి. సిస్టమ్స్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి ఆమెనుంచి పాస్‌ వర్డ్‌ లు దొంగిలించి.. పేపర్లు లీక్ చేశారని మొదట్లో అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఆమె పాత్ర ఉందా అనే అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

First Published:  30 May 2023 4:17 PM GMT
Next Story