Telugu Global
Telangana

Chalapathi Rao: టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. - సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు క‌న్నుమూత‌

Chalapathi Rao: ఆదివారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో ఆయ‌న మృతిచెందారు. చ‌ల‌ప‌తిరావు త‌న‌యుడు ర‌విబాబు ఇంట్లోనే ఆయ‌న గుండెపోటుకు గురై మృతిచెందారు. ఆస్ప‌త్రికి తీసుకెళ్లే స‌మ‌యం కూడా లేద‌ని తెలిసింది.

Chalapathi Rao: టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. - సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు క‌న్నుమూత‌
X

టాలీవుడ్‌ని ఈ ఏడాది వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ కృష్ణ మృతిచెంద‌గా, న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతిచెంది రెండు రోజులు కాక‌ముందే మ‌రో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు క‌న్నుమూశారు. ఆదివారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో ఆయ‌న మృతిచెందారు. చ‌ల‌ప‌తిరావు త‌న‌యుడు ర‌విబాబు ఇంట్లోనే ఆయ‌న గుండెపోటుకు గురై మృతిచెందారు. ఆస్ప‌త్రికి తీసుకెళ్లే స‌మ‌యం కూడా లేద‌ని తెలిసింది.

కైకాల స‌త్య‌నారాయ‌ణ అంత్య‌క్రియ‌లు నిన్న‌నే పూర్తయ్యాయి. ఇంత‌లోనే చ‌ల‌ప‌తిరావు మృతిచెందడాన్ని టాలీవుడ్ జీర్ణించుకోలేక‌పోతోంది. ఆయ‌న త‌న‌యుడు ర‌విబాబు న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాతలు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మ‌రో ఇద్ద‌రు కుమార్తెలు కూడా ఉన్నారు. వారు యూఎస్‌లో ఉన్న‌ట్టు తెలిసింది. వారు వ‌చ్చిన త‌ర్వాత అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం.

కృష్ణాజిల్లా పామ‌ర్రు మండ‌లం బ‌ల్లిప‌ర్రు చ‌ల‌ప‌తిరావు స్వ‌గ్రామం. 1944 మే 8న ఆయ‌న జ‌న్మించారు. దాదాపు 1200కు పైగా సినిమాల్లో న‌టించారు. క్యారెక్ట‌ర్‌గా ఆర్టిస్టుగా, విల‌న్‌, కామెడీ త‌దిత‌ర విభిన్న‌ పాత్ర‌ల‌తో సినీ అభిమానుల‌ను విశేషంగా అల‌రించారాయ‌న‌.

First Published:  25 Dec 2022 2:29 AM GMT
Next Story