Telugu Global
Telangana

100 శాతం ODF ప్లస్ గ్రామాలతో దేశంలోనే తెలంగాణ ఫస్ట్.. - స్వచ్ఛ్‌ భారత్ గ్రామీణ మిషన్ లో మరో మైలురాయి

ODF ప్లస్ గ్రామాలు అంటే బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా గుర్తింపు పొందడమే గాకుండా.. ఆ గ్రామాల్లో వేస్ట్ మేనేజ్ మెంట్ ను సమర్థ‌వంతంగా నిర్వహించడం.

100 శాతం ODF ప్లస్ గ్రామాలతో దేశంలోనే తెలంగాణ ఫస్ట్.. - స్వచ్ఛ్‌ భారత్ గ్రామీణ మిషన్ లో మరో మైలురాయి
X

100 శాతం ODF ప్లస్ గ్రామాలతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 99.55 శాతంతో రెండో స్థానంలో కర్ణాటక, 97.8 శాతంతో తమిళనాడు, 95.2% తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ఇక చిన్న రాష్ట్రాల్లో గోవా 95.3%, సిక్కిం 69.2% తో మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ, లక్ష్యదీప్ లు 100% ODF ప్లస్ గ్రామాలను కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ODF ప్లస్ హోదా సాధించడానికి ఎంతో కృషి చేశాయి.

అత్యధిక శాతం ODF ప్లస్ హోదా పొందిన రాష్ట్రాల కృషి ఫలితంగా స్వచ్ఛ్‌ భారత్ గ్రామీణ మిషన్ లో దేశం మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు దేశంలోని సగం గ్రామాలు అంటే 50% శాతం గ్రామాలు రెండో దశ స్వచ్ఛ్‌ భారత్ మిషన్ లో ODF ప్లస్ హోదా పొందాయి. ODF ప్లస్ గ్రామాలు అంటే బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా గుర్తింపు పొందడమే గాకుండా.. ఆ గ్రామాల్లో వేస్ట్ మేనేజ్ మెంట్ ను సమర్థ‌వంతంగా నిర్వహించడం.

తడి, పొడి చెత్తను ప్రాసెస్ చేసి వాటిని తిరిగి ఇతర ప్రయోజనాలకు వినియోగించుకోవడం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలను ODF ప్లస్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 వరకు స్వచ్ఛ్‌ భారత్ గ్రామీణ మిషన్ రెండో దశ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది గొప్ప ముందడుగు.

First Published:  11 May 2023 2:32 AM GMT
Next Story