Telugu Global
Telangana

రాజ్యాంగ పీఠిక వివాదంపై తెలంగాణ ఎస్సీఈఆర్టీ వివరణ

ఇది అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప.. కావాలని చేసింది కాదని తెలిపారు.

రాజ్యాంగ పీఠిక వివాదంపై తెలంగాణ ఎస్సీఈఆర్టీ వివరణ
X

ఇటీవల ఎన్సీఈఆర్టీ పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా పదో తరగతి సోషల్ టెక్ట్స్ బుక్స్‌ అట్టపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక తప్పుల తడకగా ఉండటపై అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ ఎస్సీఈఆర్టీ ముద్రించిన ఇంగ్లీశ్, తెలుగు మీడియం టెక్ట్స్ బుక్స్‌పై రాజ్యంగ పీఠిక నుంచి సామ్యవాద (సోషలిస్ట్), లౌకిక (సెక్యులర్) అనే పదాలు మిస్ అవడం వివాదానికి దారి తీసింది. దీనిపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం. రాధా రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ఎస్సీఈఆర్టీ ముద్రించిన తెలుగు, ఇంగ్లీష్ మీడియం సోషల్ పుస్తకాల ముఖ చిత్రంపై ఉన్న రాజ్యాంగ పీఠిక ఇమేజెస్‌లో తప్పులు దొర్లినట్లు గుర్తించాము. రాజ్యాంగ పీఠికకు సంబంధించిన ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసినప్పుడు జరిగిన పొరపాటుగా తేలింది. ఇమేజెస్‌లో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు మిస్ అయిన విషయాన్ని ముద్రించే సమయంలో గుర్తించలేదు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప.. కావాలని చేసింది కాదని తెలిపారు. ఈ పొరపాటు గుర్తించకుండానే అన్ని పాఠశాలకలు సోషల్ టెక్ట్స్ బుక్స్ పంపిణీ జరిగాయని అన్నారు.

రాజ్యాంగ పీఠికకు సంబంధించిన సవరించిన ఇమేజ్‌ను ఇప్పటికే అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాము. దాన్ని పదో తరగతి సోషల్ టెక్ట్స్ బుక్ అట్టాపై అతికించాలని ఆదేశాలు జారీ చేశాము. హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్ ఈ మేరకు సోషల్ బుక్స్‌పై కొత్త ఇమేజీని అతికిస్తారని రాధారెడ్డి వెల్లడించారు.

First Published:  23 Jun 2023 4:04 PM GMT
Next Story