Telugu Global
Telangana

తెలంగాణలో మరో సర్వే.. కాంగ్రెస్, బీజేపీకి మరీ అన్ని తక్కువ సీట్లా..?

సీఎం సీటు కోసం అడిగిన ప్రశ్నలో కేసీఆర్ కి దరిదాపుల్లో ప్రతిపక్షాల నేతలెవరూ లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ కి 36శాతం ఓట్లు, బీజేపీకి 13శాతం ఓట్లు, ఎంఐఎంకి 4శాతం ఓట్లు పోలవుతాయని సర్వే చెబుతోంది.

తెలంగాణలో మరో సర్వే.. కాంగ్రెస్, బీజేపీకి మరీ అన్ని తక్కువ సీట్లా..?
X

తెలంగాణలో మరో సర్వే.. కాంగ్రెస్, బీజేపీకి మరీ అన్ని తక్కువ సీట్లా..?

తెలంగాణ ఎన్నికల సర్వేలన్నీ బీఆర్ఎస్ కే అధికారం అని ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ ని కూడా తక్కువ అంచనా వేయలేమని, ఆ పార్టీ కూడా గణనీయంగా సీట్లు సాధిస్తుందని అంటున్నాయి. బీఆర్ఎస్ మెజార్టీ మార్కుని ధీమాగా దాటుతుందని, ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది సర్వేల సారాంశం. తాజా సర్వే కూడా బీఆర్ఎస్ కే పట్టం అని చెబుతున్నా... కాంగ్రెస్, బీజేపీకి మాత్రం మరీ తక్కువ స్థానాలు వస్తాయని చెప్పడం విశేషం.

జీ న్యూస్ - మ్యాట్రిజ్ సంయుక్త సర్వే ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో మొత్తం స్థానాలు -119

బీఆర్ఎస్ 70-76

కాంగ్రెస్ 27-33

బీజేపీ 5-8

ఎంఐఎం 6-7

మిగతా సర్వేలన్నీ కాంగ్రెస్ కి కనీసం 40 సీట్లు వస్తాయని చెబుతున్నా.. జీన్యూస్ మాత్రం ఆ పార్టీ 33 సీట్లు దాటడం కష్టం అని తేల్చేసింది. ఇక బీజేపీ 5నుంచి 8 సీట్ల మధ్యే ఆగిపోతుందని జీ న్యూస్ సర్వే స్పష్టం చేసింది.

ఓట్ల శాతం లెక్క తీస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధికంగా 43 శాతం ఓట్లు కొల్లగొడుతుందని జీ న్యూస్ సర్వే చెబుతోంది. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని 36శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపింది. సీఎం సీటు కోసం అడిగిన ప్రశ్నలో కేసీఆర్ కి దరిదాపుల్లో ప్రతిపక్షాల నేతలెవరూ లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ కి 36శాతం ఓట్లు, బీజేపీకి 13శాతం ఓట్లు, ఎంఐఎంకి 4శాతం ఓట్లు పోలవుతాయని సర్వే చెబుతోంది.

First Published:  6 Nov 2023 3:46 AM GMT
Next Story