Telugu Global
Telangana

చంద్రబాబు దూరంగా పెడితే కేసీఆర్‌ దగ్గర తీసుకున్నారా?

ఎన్‌టీ రామారావు శతజయంతి ఉత్సవానికి పిలిస్తే జనాల అటెన్షన్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్‌పైనే ఉంటుందని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఉత్సవాలకు జూనియర్‌ను దూరంగా పెట్టేశారు. అయితే ఖమ్మంలో జరగబోయే ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిచింది.

చంద్రబాబు దూరంగా పెడితే కేసీఆర్‌ దగ్గర తీసుకున్నారా?
X

జూనియర్ ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబు నాయుడు ఎంతగా భయపడుతున్నారు అనేందుకు ఇదే తాజా ఉదాహరణ. మొన్ననే విజయవాడ దగ్గరలోని పోరంకిలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి ఎక్కడో చెన్నైలో ఉన్న రజనీకాంత్‌ను ముఖ్య అతిధిగా పిలిచారు కానీ హైదరాబాద్‌లోనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం పిలవలేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే ఖమ్మంలో జరగబోయే ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా పిలిచింది కాబట్టే. జూనియర్‌ను చంద్రబాబు దూరంగా పెడితే కేసీఆర్‌ దగ్గరకు తీసుకుంటున్నట్లుగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌ రాక సందర్భంగా భారీ కార్యక్రమాలు చేస్తున్నారట.

బాలకృష్ణ సినీ జీవితం చివరి దశకు చేరుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాల్లో ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నారు. శతజయంతి ఉత్సవాలకు రజనీని పిలిచిన చంద్రబాబు, బాలకృష్ణ మరి జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం ఎందుకు పిలవలేదు? అసలు ఉత్సవాలకు జూనియర్‌ను పూర్తి దూరంగా పెట్టేశారు. సరే తాత శతజయంతి ఉత్సవాలకు మనవడిని పిలవకపోతే జూనియర్‌కు వచ్చిన నష్టమేమీలేదు. కాకపోతే చంద్రబాబులోని భయమే బయటపడింది.

పార్టీలో జూనియర్ భాగస్వామ్యం ఉంటే తనతో పాటు కొడుకు లోకేష్‌కు ఇబ్బందులు తప్పవనే అభద్రత చంద్రబాబులో పెరిగిపోతోంది. అందుకనే ఎంత వీలైతే అంతగా జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా పెడుతున్నది. వీలైనంతలో పార్టీలో జూనియర్ ప్రస్తావన కూడా ఎక్కడా వినబడకుండా చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే జూనియర్ ప్రస్తావన అంత బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా అక్కడ అభిమానులు+టీడీపీలోని యువత జూనియర్ ఎన్టీఆర్‌కు జిందాబాదులు కొడుతున్నారు. కాబోయే సీఎం జూనియర్ అని నినాదాలిస్తున్నారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో జ‌రుగుతున్న‌ పర్యటనల్లో జూనియర్ గోల పెరిగిపోతుండటం చంద్రబాబుకు సమస్యగా మారిపోయింది. సీనియర్ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవానికి పిలిస్తే జనాల అటెన్షన్ మొత్తం జూనియర్‌పైనే ఉంటుందని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఉత్సవాలకు జూనియర్‌ను దూరంగా పెట్టేశారు. పోరంకిలో ఉత్సవానికి జూనియర్‌ను దూరంగా పెట్టేస్తే ఖమ్మం లక్కారం చెరువు ట్యాంక్ బండ్‌పైన జరగబోయే కార్యక్రమానికి జూనియర్‌ను పిలిచారు. ఈ నెల 28న 58 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ జరగబోతోంది.

First Published:  5 May 2023 5:49 AM GMT
Next Story