Telugu Global
Telangana

పర్యావరణంలో ఘనం.. దేశంలోనే తెలంగాణ నెంబర్-1

కేవలం అడవుల విస్తీర్ణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోలేదు. పచ్చదనం పెరుగుదల, మున్సిపల్‌ ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి, భూగర్భ జలాలు, నీటి వనరులు అనే ఏడు అంశాలను CSE పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేపట్టింది. తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది.

పర్యావరణంలో ఘనం.. దేశంలోనే తెలంగాణ నెంబర్-1
X

జాతీయ స్థాయిలో తెలంగాణ చాలా విషయాల్లో నెంబర్-1 గా నిలిచింది. ఈ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్ర‌పంచ పర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌ మెంట్ విడుదల చేసిన పుస్తకంలో తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలిచింది. పెరిగిన అడ‌వుల శాతం, మున్సిప‌ల్ వేస్ట్ మేనేజ్‌ మెంట్‌ లో తెలంగాణ ముందుంది.

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(CSE) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసింది. కేవలం అడవుల విస్తీర్ణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోలేదు. పచ్చదనం పెరుగుదల, మున్సిపల్‌ ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి, భూగర్భ జలాలు, నీటి వనరులు అనే ఏడు అంశాలను CSE పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేపట్టింది. తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది.

హరిత హారం ఘనతే..

తెలంగాణ రాష్ట్రానికి నెంబర్-1 స్థానం రావడానికి ప్రధాన కారణం హరితహారం అని అన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ మానస పుత్రికగా హరితహారం ఘన విజయానికి ఇది మరో ఉదాహరణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారాయన.


మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి..?

తెలంగాణ తర్వాత గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హర్యానా.. ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఆరో స్థానం దక్కింది. బీజేపీ గొప్పలు చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ 16వ స్థానంలో ఉండటం విశేషం.

హరిత హారం కింద ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 273 కోట్ల మొక్కలను నాటింది. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నాయి. హరితహారం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. ప్రతి గ్రామంలో ఒక నర్సరీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నర్సరీలు, 19,400కు పైగా పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో రూ.700 కోట్లతో 180 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్ లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ నగరానికి వరల్డ్‌ ట్రీ సిటీగా రెండుసార్లు గుర్తింపు లభించింది. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ పచ్చదనంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది.

First Published:  5 Jun 2023 2:38 AM GMT
Next Story