Telugu Global
Telangana

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

గతంలో ఓసారి ఇలాగే శాఖలు కేటాయించారంటూ సోషల్ మీడియాలో హడావిడి జరిగింది. ఆ వార్తల్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈసారి మాత్రం అధికారికంగా మంత్రులకు శాఖలు కేటాయించారు.

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
X

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. దీనికోసమే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈరోజు శాఖలపై ఆయన ప్రకటన విడుదల చేశారు.

మంత్రులు - శాఖలు

భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాలు

దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ బి, సినిమాటోగ్రఫీ

పొన్నం ప్రభాకర్‌ - రవాణా, బీసీ సంక్షేమం

తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయం, చేనేత

జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్‌, పర్యాటకం

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ

సీతక్క - పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం

కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ

గతంలో ఓసారి ఇలాగే శాఖలు కేటాయించారంటూ సోషల్ మీడియాలో హడావిడి జరిగింది. ఆ వార్తల్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈసారి మాత్రం అధికారికంగా మంత్రులకు శాఖలు కేటాయించారు.

First Published:  9 Dec 2023 4:38 AM GMT
Next Story