Telugu Global
Telangana

గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ నివాళి..

ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్‌ అని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకువచ్చిన ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌ అని కొనియాడారు.

గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ నివాళి..
X

ప్రజా గాయకుడు గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. తెలంగాణ ఎమ్మెల్యేలు గద్దర్ తో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో గద్దర్ కొత్త ఊపు తీసుకొచ్చారని చెప్పారు.


ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్‌ అని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకువచ్చిన ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌ అని కొనియాడారు. గద్దర్ మరణం తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి, దుఃఖాన్ని కలిగించిన వార్త అని అన్నారు కేటీఆర్. ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచి, విప్లవ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి, ఎన్నో సందర్భాల్లో తన పాటలతో ప్రజలను ఊర్రూతలూగించిన అద్భుతమైన గాయకుడు గద్దర్‌ అని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వేదికను పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. శాసనసభ, ప్రభుత్వం తరపున సంతాపం ప్రకటించారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం, జానపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు కేటీఆర్‌.


తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని అన్నారు సీఎం కేసీఆర్. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

First Published:  6 Aug 2023 4:09 PM GMT
Next Story