Telugu Global
Telangana

సత్యం స్కామ్‌లో అప్డేట్‌.. రూ.1,747 కోట్లు చెల్లించాలి

2018 అక్టోబర్‌, నవంబర్‌లో 12 శాతం వార్షిక వడ్డీతో రూ.840.15 కోట్లు చెల్లించాలని సెబీ ఇచ్చిన ఆదేశాలను స‌త్యం రామలింగ రాజుసహా ఆరుగురు సవాల్‌ చేశారు.

సత్యం స్కామ్‌లో అప్డేట్‌.. రూ.1,747 కోట్లు చెల్లించాలి
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ కుంభకోణం కేసులో.. మార్కెట్స్ రెగ్యులేటర్‌ సెక్యూరిటీస్ అండ్‌ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్‌ ఇండియా-సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధంగా పొందిన లాభాలు రూ.624 కోట్లను 2009 జనవరి 7 నుంచి ఇప్పటిదాకా 12 శాతం వార్షిక వడ్డీతో ఈ మొత్తాన్ని చెల్లించాల‌ని 96 పేజీల ఆర్డర్‌లో పేర్కొంది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా క‌ట్టాల‌ని ఆరుగురిని ఆదేశించింది.

వీరిలో సత్యం మాజీ ఛైర్మన్‌ బి.సత్యం రామలింగరాజు, మాజీ ఎండీ బి.రామరాజు, బి.సూర్యనారాయణ రాజు(రామలింగరాజు సోదరుడు).. వీరితో పాటు SRSR హోల్డింగ్, వి.శ్రీనివాస్‌ మాజీ CFO, జి.రామకృష్ణ మాజీ వైస్‌ప్రెసిడెంట్‌- ఫైనాన్స్‌ ఉన్నారు. ఈ రూ.624 కోట్లు 12 శాతం వడ్డీతో కలుపుకుంటే ఇప్పుడు రూ.1,747 కోట్లకు చేరింది.


2018 అక్టోబర్‌, నవంబర్‌లో 12 శాతం వార్షిక వడ్డీతో రూ.840.15 కోట్లు చెల్లించాలని సెబీ ఇచ్చిన ఆదేశాలను స‌త్యం రామలింగ రాజుసహా ఆరుగురు సవాల్‌ చేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శాట్‌.. మళ్లీ లెక్కించి తాజా ఆదేశాలివ్వాలంటూ సెబీకి సూచించింది. ఈ నేపథ్యంలోనే సెబీ కొత్త ఆర్డర్‌ ఇచ్చింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తంలో రూ.1,123 కోట్లు వడ్డీనే. 2009 జనవరి 7న ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది.

First Published:  2 Dec 2023 5:32 AM GMT
Next Story