Telugu Global
Telangana

బీఆర్ఎస్ శ్రేణుల్ని రెచ్చగొట్టిన రేవంత్.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు

ఆరు నూరైనా, ఇటు సూర్యుడు అటు పొడిచినా ఆగస్ట్-15లోగా రుణమాఫీ చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ శ్రేణుల్ని రెచ్చగొట్టిన రేవంత్.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు
X

తెలంగాణలో రాజకీయ విమర్శలు శృతి మించుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. లిల్లీపుట్ అంటూ అటువైపు నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఇక ఇటునుంచి కూడా రేవంత్ రెడ్డి అంతే ఘాటుగా బదులిస్తున్నారు. పేగులు తెంచి మెడలో వేసుకుంటానని పంచ్ డైలాగులు కొడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తన హామీని నిలబెట్టుకోలేదనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ప్రమాణ స్వీకారం రోజునే రుణమాఫీ జరిగిపోతుందని ఎన్నికల వేళ రేవంత్ హామీ ఇచ్చి రైతుల్ని మోసం చేశారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయంలో ఇటీవలే కొత్త డెడ్ లైన్ ప్రకటించారు సీఎం. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు, లోక్ సభ ఎన్నికల కోడ్ వల్లే రుణమాఫీ ఆలస్యమవుతోందన్నారు. ఈ కొత్త డెడ్ లైన్ పై కూడా బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేయలేకపోతే రాజీనామా చేస్తావా రేవంత్.. అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. దీనికి బదులిస్తున్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆరు నూరైనా, ఇటు సూర్యుడు అటు పొడిచినా ఆగస్ట్-15లోగా రుణమాఫీ చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీఆర్ఎస్ నుంచి అంతే తీవ్ర మైన రిప్లై ఉంటుంది. రేపటినుంచి కేసీఆర్ బస్సుయాత్ర మొదలవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.

First Published:  23 April 2024 12:32 PM GMT
Next Story