Telugu Global
Telangana

అక్కడే సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్‌.. మొదలైన నిర్మాణ పనులు

కొత్త భవనాలు కట్టమని, ఉన్నవాటినే సమర్థవంతంగా వినియోగించుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఇవాళ కూడా మీడియాతో చిట్‌చాట్‌లో అదే మాట చెప్పారు.

అక్కడే సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్‌.. మొదలైన నిర్మాణ పనులు
X

సీఎం రేవంత్‌ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసు పనులు ప్రారంభమ‌య్యాయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలోని ఓ ఎకరా స్థలంలో రేవంత్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం కాబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయమే భూమిపూజ జరిగింది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్లకు MCRHRD ట్రైనింగ్ సెంటర్‌గా ఉంది. దాంతో మిగతా కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా కార్నర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను నిర్మిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండబోతోంది. ఆఫీసు చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి. MCRHRD విశాలంగా ఉండటంతో సీఎంను కలిసేందుకు అతిథులు వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజిట‌ర్స్, వీఐపీల కోసం భవనాలు, వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యం ఉంది.

కొత్త భవనాలు కట్టమని, ఉన్నవాటినే సమర్థవంతంగా వినియోగించుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఇవాళ కూడా మీడియాతో చిట్‌చాట్‌లో అదే మాట చెప్పారు. ముఖ్యమంత్రిగా ఎలాంటి ఆడంబరాలకు పోదల్చుకోలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దుబారాను తగ్గించాలనుకుంటున్నానని చెప్పారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేదని.. ఇందుకోసం MCRHRD ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఎకరం స్థలంలో రేకుల షెడ్డుని నిర్మించుకుని.. దాన్ని వాడుకోనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  15 Dec 2023 12:16 PM GMT
Next Story