Telugu Global
Telangana

డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం ‘దోస్త్’ షెడ్యూల్ విడుదల

షెడ్యూల్ ప్రకారం మే 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. మే 20 నుంచి జూన్ 11వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం ‘దోస్త్’ షెడ్యూల్ విడుదల
X

తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం ‘దోస్త్’ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మూడు దశల్లో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లు పూర్తి చేయనున్నట్టు దోస్త్‌ కన్వీనర్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మే 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. మే 20 నుంచి జూన్ 11వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

రెండో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లకు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు గడువు ఉంటుంది. రెండో విడత వెబ్‌ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

అదే విధంగా మూడో విడత రిజిస్ట్రేషన్లకు గడువు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది. జూలై 1 నుంచి 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఇవ్వాలి. జూలై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూలై 17 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్‌ వెల్లడించారు.

First Published:  11 May 2023 5:33 PM GMT
Next Story