Telugu Global
Telangana

వెళ్లవయ్యా, వెళ్లు. వెళ్లూ..! గాంధీ భవన్ లో పోస్టర్లు

మధుయాష్కీని టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేశారు. అది కూడా గాంధీ భవన్ లోనే ఆ పోస్టర్లు అంటించడం విశేషం. గో బ్యాక్ నిజామాబాద్ అంటూ వెలసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వాటిని వెంటనే తొలగించినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరుగుతోంది.

వెళ్లవయ్యా, వెళ్లు. వెళ్లూ..! గాంధీ భవన్ లో పోస్టర్లు
X

తెలంగాణలో ఇటీవల పోస్టర్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టి తిట్టినా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ పెద్దగా అటెన్షన్ చూపించదు, అదే నేరుగా పోస్టర్ వేస్తే మాత్రం ఎక్కడలేని హడావిడి జరుగుతోంది. అందుకే మధుయాష్కీ వ్యతిరేక వర్గం కూడా పోస్టర్లనే ఎంచుకుంది. అది కూడా నేరుగా గాంధీ భవన్ గోడలపై అంటించే సరికి ఈ పోస్టర్ల వ్యవహారం మరింత రచ్చకెక్కింది.

ఇంతకీ ఏంటా పోస్టర్లు..?

దాదాపు 20 ఏళ్లుగా నిజామాబాద్ నుంచి రాజకీయం చేస్తున్న మధుయాష్కీ రెండు దఫాలు ఎంపీగా కాంగ్రెస్ తరపున గెలిచారు, మరో రెండు దఫాలు అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారు. ఇటీవల ఎల్బీ నగర్ అభ్యర్థిగా టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు కూడా. కానీ ఆయన రాక స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు. అందుకే ఆయన్ను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేశారు. అది కూడా గాంధీ భవన్ లోనే ఆ పోస్టర్లు అంటించడం విశేషం. గో బ్యాక్ నిజామాబాద్ అంటూ వెలసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వాటిని వెంటనే తొలగించినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరుగుతోంది.

పోస్టర్ల సృష్టికర్త ఎవరు..?

మధుయాష్కీపై పోస్టర్లు వేయిచింది ఎల్బీనగర్‌ కు చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్‌ నేతలు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మధు యాష్కీగౌడ్ కోరారు. ఈరోజే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండటం, అభ్యర్థిత్వాలు ఖరారు కాబోతుండటం తెలిసిందే. ఈ టైమ్ లో పోస్టర్లు కాస్త సంచలనంగా మారాయి. స్థానిక నాయకులు మధు రాకను వ్యతిరేకిస్తున్నారనేది తేలిపోయింది. అయితే ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. కేవలం ఒకరిద్దరు వ్యతిరేకిస్తే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. అయితే పోస్టర్లతో మధు యాష్కీ ఇమేజి కాస్త డ్యామేజీ అయింది.

First Published:  4 Sep 2023 7:43 AM GMT
Next Story