Telugu Global
Telangana

ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమిచ్చారు..? మోదీకి బహిరంగ లేఖ..

మాటలు చాలు, ఇకనైనా చేతల్లో చూపించండి అంటూ తెలంగాణ మేధావులు, ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. 8 అంశాలపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరారు.

ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమిచ్చారు..? మోదీకి బహిరంగ లేఖ..
X

తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్ల‌యింది. ఈ ఎనిమిదేళ్లలో చాలాసార్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారు, వెళ్లారు. కానీ ఏమిచ్చారన్నదే ప్రశ్నార్థకం. ఇవ్వకపోగా చాలా కంపెనీలు, ప్రాజెక్ట్ లను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేశారు. అర్హతలున్నా కూడా తెలంగాణకు మొండిచేయి చూపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఆయన తెలంగాణకు వస్తున్నారు. ఈసారి కూడా గతంలో ప్రారంభమైన ఎరువుల కర్మాగారాన్నే తిరిగి ప్రారంభిస్తానంటున్నారు. ఎన్నాళ్లీ నాటకాలు, ఎన్నేళ్లీ మోసపు మాటలు.

మాటలు చాలు, ఇకనైనా చేతల్లో చూపించండి అంటూ తెలంగాణ మేధావులు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు.


ఆ లేఖ సారాంశం ఇది..

మరోసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం. గతంలో అనేక సందర్భాల్లో మీరు తెలంగాణకు రావడం, ఉపన్యాసాలు, హామీలు ఇచ్చి వెళ్లడం జరిగింది. కానీ, మీరు ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదు. కనీసం ఈ సారి అయినా ఇచ్చిన హామీల పట్ల మీరు ఏం చర్యలు తీసుకున్నారో ప్రకటిస్తారని ఆశిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలంగాణ ప్రజానీకం తరపున మీకు మరోసారు గుర్తుచేయాలని భావిస్తున్నాం.

మేం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎన్నో ఏళ్ళు పోరాటం చేశాం. ఇక్కడి ప్రజల కలలు నెరవేరతాయని ఆశించాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇంకా విభజన హామీలు నెరవేరలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీపై కేంద్రం నుంచి ఎలాంటి కదలిక లేదు. ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టకుండా ఇతర రాష్ట్రాల్లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం తెలంగాణపై చిన్న చూపుకి నిదర్శనం. తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్శిటీ ఊసే లేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన పారిశ్రామిక రాయితీల సంగతి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది.


ఒకవైపు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోగా, మరోవైపు గత 8 ఏళ్లలో తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు ఎన్నో తీసుకుంది మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కొన్ని లక్షల మంది తెలంగాణ యువతకు ఉజ్వల ఉపాధి కల్పించే సామర్ధ్యం ఉన్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దుచేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్ వేర్‌ పార్కులను ప్రకటించి తెలంగాణకు మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం. మీరు ప్రధాని అయ్యాక దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు, 16 ఐఐఎం, 87 నవోదయ పాఠశాలలు, 12ఐసీఆర్‌, ట్రిపుల్‌ ఐటీలు ఇతర విద్యా సంస్థలు మంజూరు చేసినా, ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థను కూడా కేంద్రం తెలంగాణకు కేటాయించలేదు.


దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లింది. కులాలు, మతాలు, జాతులు.. మొత్తంగా ప్రజల మధ్య విద్వేషాలు, అసహనం పెరిగిపోతున్నాయి. దళితులపై దాడులు పెరిగాయి. అల్పసంఖ్యాక వర్గాలు అనుక్షణం భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల మత విశ్వాసాల పట్ల, ఆహారపు అలవాట్ల పట్ల, వేష, భాషల పట్ల ఏకపక్ష నిర్ణయాలను అమలు చేస్తూ నియంతృత్వ తరహాలో కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న లౌకిక దేశం.. మతోన్మాద రాజ్యాంగంగా మారుతోంది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి. మీడియా, కేంద్ర దర్యాప్తు సంస్థలు, చివరికి సైనిక దళాలను కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని దేశమంతా చూస్తోంది.

మీ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. కోట్లాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కొవిడ్‌ నియంత్రణలో మీ ప్రభుత్వ వైఫల్యం లక్షల ప్రాణాలను హరించింది. విద్యుత్‌ సంస్కరణల పేరిట రైతు మెడపై మోటార్లకు మీటర్ల కత్తి వేలాడదీసి అటు వ్యవసాయాన్ని ఇటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్ని దెబ్బతీసిన మీరు.. మీ కార్పొరేట్‌ మిత్రులకు మాత్రం లక్షల కోట్లు దోచి పెడుతున్నారు. ఒకవైపు కోట్లాదిమంది భారతీయులు అత్యంత పేదరికంలోకి జారిపోతుంటే, మీ ఇద్దరు మిత్రులేమో ప్రపంచ కుబేరులుగా మారుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు తగ్గినా, రోజు రోజుకీ మీరు పెంచుతున్న పెట్రోల్‌ ధరలు, తద్వారా పెరిగిన నిత్యావసరాల ధరలు రైతులను, మధ్యతరగతి, పేద ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇక్కడ పండిన ధాన్యం కొనడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరితమైన పక్షపాత ధోరణి వలన తెలంగాణ రైతులు తీవ్ర కష్టనష్టాలకు లోనవుతున్నారు. దీంతోపాటు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి బడుగు, బలహీనవర్గాల భవిష్యత్‌ ను కాలరాస్తున్న మీ కేంద్రం, తెలంగాణ లోని సింగరేణిని కూడా ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతోంది.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల.. తెలంగాణ వ్రజల సంక్షేమం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కింది సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. మీ తెలంగాణ పర్యటనలో వీటిపై మీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

1. విభజన చట్టంలో తెలంగాణ కు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.

2. ఐటీఐఆర్‌ ను పునరుద్ధరించాలి, లేదా దానికి సమానమైన ఒక పథకాన్ని ప్యాకేజీని తెలంగాణకు ప్రకటించాలి.

3. తెలంగాణకు సాఫ్ట్‌ వేర్‌ టెక్నాలజీ పార్కులు కేటాయించాలి.

4. తెలంగాణకు మెడికల్‌ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐఎం లాంటి విదా సంస్థలను కేటాయించాలి.

5. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలి.

6. తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరిత, వివక్షపూరిత పక్షపాత ధోరణిని విడనాడాలి.

7. మత తత్వ ధోరణిని విడనాడి, దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకొనే విధంగా పాలన కొనసాగించాలి.

8. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలి.

ధన్యవాదాలతో..

1. ప్రొఫెసర్‌ రమా మేల్కొటే, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఉస్మానియా యూనివర్సిటీ

2. ప్రొఫెసర్‌ షీలా ప్రసాద్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

3. ప్రొఫెసర్‌ గట్టు సత్యనారాయణ, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా యూనివర్సిటీ

4. ప్రొఫెసర్‌ ఎం.చెన్న బసవయ్య, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా యూనివర్సిటీ

5. ప్రొఫెసర్‌ ఎంవీ రమణమూర్తి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

6. ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

7. ప్రొఫెసర్‌ వి. కృష్ణ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

8. ప్రొఫెసర్‌ పిల్లలమర్రి రాములు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

9. ప్రొఫెసర్‌ రాఘవరెడ్డి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

10. ప్రొఫెసర్‌ టి. శ్రీనివాస్‌, కాకతీయ యూనివర్సిటీ

11. ప్రొఫెసర్‌ సిహెచ్‌.దినేష్‌, కాకతీయ యూనివర్సిటీ

12. ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, శాతవాహన యూనివర్సిటీ

13. గోగు శ్యామల, దళిత రచయిత్రి

14. జూపాక సుభద్ర, దళిత రచయిత్రి

15. డాక్టర్‌ వై.వెంకటేశ్వర్లు, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

16. డాక్టర్‌ పరశురాములు, ఉస్మానియా యూనివర్సిటీ

17. డాక్టర్‌. ప్రేమ్‌ కుమార్‌, ఉస్మానియా యూనివర్సిటీ

18. ప్రొఫెసర్‌ ఎం.రాములు, ఉస్మానియా యూనివర్సిటీ

19. ప్రొఫెసర్‌ ఎ.షుకూర్‌, ఉస్మానియా యూనివర్సిటీ

20. ప్రొఫెసర్‌ దేవదాస్‌, ఉస్మానియా యూనివర్సిటీ

21. ప్రొఫెసర్‌ ప్రసంగి, ఉస్మానియా యూనివర్సిటీ

22. ప్రొఫెసర్‌ వడ్డానం శ్రీనివాన్‌ రావు, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

23. ప్రొఫెసర్‌ గుంటి రవీందర్‌, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

24. ప్రొఫెసర్‌ వి. రామచంద్రం, డీన్‌ సీడీసీ, కాకతీయ యూనివర్సిటీ

25. ప్రొఫెసర్‌ ఎం.ఇ.స్వామి, కాకతీయ యూనివర్సిటీ

26. ప్రొఫెసర్‌ ఆర్‌.మల్లికార్జున్‌ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ

27. ప్రొఫెసర్‌ ఇ.నారాయణ, కాకతీయ యూనివర్సిటీ

28. ప్రొఫెసర్‌ ఎండీ ముస్తఫా, కాకతీయ యూనివర్సిటీ

29. ప్రొఫెసర్‌ ఎస్‌.జ్యోతి, కాకతీయ యూనివర్సిటీ

30. ప్రొఫెసర్‌. కె.డేవిడ్‌, కాకతీయ యూనివర్సిటీ

31. ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీ

32. డాక్టర్‌. ఎం.రజని, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

33. ప్రొఫెసర్‌ పుష్ప చక్రపాణి, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

34. ప్రొఫెసర్‌ టి.శ్రీనివాస్‌, కాకతీయ యూనివర్సిటీ

35. ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య, కాకతీయ యూనివర్సిటీ

36. ప్రొఫెసర్‌ కె.అయిలయ్య, కాకతీయ యూనివర్సిటీ

37. ప్రొఫెసర్‌ పి.అమరవేణి, కాకతీయ యూనివర్సిటీ

38. ప్రొఫెసర్‌ సి.వెంకటయ్య

39. ప్రొఫెసర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ రెడ్డి

40. డాక్టర్‌ టి.శాస్త్ర, కాకతీయ యూనివర్సిటీ

41. డాక్టర్‌ కె.సుజాత,కాకతీయ యూనివర్సిటీ

42. డాక్టర్‌ ఇ.సుజాత, కాకతీయ యూనివర్సిటీ

43. డాక్టర్‌ వై. వెంకయ్య, కాకతీయ యూనివర్సిటీ

44. డాక్టర్‌ డి.రమేశ్‌, కాకతీయ యూనివర్సిటీ

45. డాక్టర్‌ ముంజం శ్రీనివాస్‌, కాకతీయ యూనివర్సిటీ

46. డాక్టర్‌ కె.కిశోర్‌ కుమార్‌, కాకతీయ యూనివర్సిటీ

47. డాక్టర్‌ బి.శ్రీకాంత్‌, కాకతీయ యూనివర్సిటీ

48. డాక్టర్‌ పి.వి.రమణ, డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

49. డాక్టర్‌. బి. శ్రీనివాస్‌, డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

50. డాక్టర్‌ రాజు, కాకతీయ యూనివర్సిటీ

51. డాక్టర్‌. కె.మమత, కాకతీయ యూనివర్సిటీ

52. డాక్టర్‌ వెంకటేశ్వర్లు, కాకతీయ యూనివర్సిటీ

53. డాక్టర్‌ పసునూరి రవీందర్‌, రచయిత

54. స్కైబాబ, కవి, సోషల్‌ యాక్టివిన్ట్‌

55. డి. పాపారావు, ఆర్థికవేత్త

56. డాక్టర్‌. ఎస్‌.హరినాథ్‌

57. అన్వర్‌, కవి

58. డాక్టర్‌. సి.కృష్ణారావు

59. ఖలీదా పర్వీన్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌

60. ఖాజా, కవి

61. డాక్టర్‌ కృష్ణారెడ్డి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

62. డాక్టర్‌ జి.దయాకర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

63. డాక్టర్‌ జి.మల్లారెడ్డి, డాక్టర్‌, బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

64. డాక్టర్‌ బైరి నిరంజన్‌, కాకతీయ యూనివర్సిటీ

First Published:  9 Nov 2022 11:24 AM GMT
Next Story