Telugu Global
Telangana

హైదరాబాద్‌లో కలకలం.. హైకోర్ట్ గేట్ ముందు హత్య

తెలంగాణ హైకోర్టు సమీపంలోనే ఈ హత్య జరిగింది. హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని, మరో వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే పొడిచిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

హైదరాబాద్‌లో కలకలం.. హైకోర్ట్ గేట్ ముందు హత్య
X

పట్టపగలే రోడ్డుపై దారుణ హత్య జరగడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ హత్య తెలంగాణ హైకోర్టు గేటు దగ్గరే జరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కత్తితో ఓ వ్యక్తి మరొకర్ని దారుణంగా పొడిచి చంపేశాడు. శవాన్ని రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల ఉన్నవారంతా షాక్ లోకి వెళ్లగా.. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి వచ్చారు.

తెలంగాణ హైకోర్టు సమీపంలోనే ఈ హత్య జరిగింది. హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని, మరో వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే పొడిచిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు తేరుకుని సాయమందించే లోపే అతను చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రూ.10 వేల కోసం హత్య..

మృతుడు స్థానికంగా సులభ్‌ కాంప్లెక్స్‌ లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం మరో వ్యక్తితో మిథున్ కి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రూ.10వేల కోసం ఈ హత్య జరిగినట్టు స్థానికుల సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నడిరోడ్డులో, అది కూడా హైకోర్టు గేట్ దగ్గరే ఈ హత్య జరగడంతో తీవ్ర కలకలం రేగింది.

First Published:  4 May 2023 6:57 AM GMT
Next Story