Telugu Global
Telangana

యూకే పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్

యూకేలో ఈపీజీ ఆధ్వర్యంలో 'ఐడియాస్ ఫర్ ఇండియా' కాన్ఫరెన్స్ ఈ నెల 11, 12 తేదీల్లో జరుగనున్నది. ఈ సమావేశంలో పాల్గొనాలని గతంలోనే మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

యూకే పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం యూకే బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ పర్యటన సాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను కూడా మంత్రి వివరించనున్నారు. ఈ నెల 13 వరకు కేటీఆర్ పర్యటన యూకేలో కొనసాగనున్నది.

యూకేలో ఈపీజీ ఆధ్వర్యంలో 'ఐడియాస్ ఫర్ ఇండియా' కాన్ఫరెన్స్ ఈ నెల 11, 12 తేదీల్లో జరుగనున్నది. ఈ సమావేశంలో పాల్గొనాలని గతంలోనే మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో కేటీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు. అలాగే బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగే సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొంటారు. లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్హోత్రా నిర్వహిస్తున్న ఈ డిన్నర్ మీట్‌కు కేటీఆర్ హాజరవుతారు.

దాదాపు 800 మంది వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యూకే వ్యాప్తంగా తొలిసారిగా 'ఇండియా వీక్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఈవెంట్ జరుగనున్నది.


First Published:  10 May 2023 6:17 AM GMT
Next Story