Telugu Global
Telangana

BRS అంటే భారత “రైతు” సమితి

జై కిసాన్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ నినాదం మాత్రమే కాదని, అది తమ ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిందని చెప్పారు మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. ఆయన సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.

BRS అంటే భారత “రైతు” సమితి
X

రైతు రుణమాఫీతో మరోసారి సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలబడ్డారు. రుణాల ఊబిలో కూరుకుపోయినవారికి ఉపశమనం కల్పించారు. ఈరోజు నుంచే రుణమాఫీ కార్యాచరణ మొదలైంది. నెలన్నర రోజుల్లోగా విడతల వారీగా రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియ ఈరోజునుంచి మొదలు పెట్టింది. మొత్తం రూ.19 వేల కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరే అవకాశముంది. రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ ఆసక్తిర ట్వీట్ వేశారు. BRS అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజవైందన్నారాయన.


సీఎం కేసీఆర్ సంకల్ప బలం..

జై కిసాన్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ నినాదం మాత్రమే కాదని, అది తమ ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిందని చెప్పారు మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. ఆయన సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం, దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని కొనియాడారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం.. తెలంగాణ చరిత్రలో వ్యవసాయ రంగంపై చెరగని సంతకం అన్నారు.

కేంద్రం ఇబ్బంది పెట్టినా..

నిధుల విడుదలలో వివక్ష చూపిస్తూ కేంద్రం ఇబ్బందులు పెట్టినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షానే నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వంటి అనాలోచిత నిర్ణయాలతో ఆదాయం తగ్గినా కూడా తాము వెనకడుగు వేయలేదన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం అనే పేరుందని, కానీ తెలంగాణలో వ్యవసాయం అంటే సంతోషం అని వివరించారు మంత్రి కేటీఆర్.

First Published:  3 Aug 2023 5:28 AM GMT
Next Story