Telugu Global
Telangana

పొద్దున లేస్తే బూతులు మాట్లాడటం కాదు, దమ్ముంటే నిధులు తీసుకరా - బండికి కేటీఆర్ సవాల్

ప్రతి రోజు ప్రభుత్వాన్ని విమర్శించే బండి సంజయ్ కి దమ్ముంటే, ఆయన నిజంగానే వేముల వాడ రాజన్న భక్తుడే అయితే వేముల‌వాడ అభివృద్దికి కేంద్రం నుంచి రూ. 100 కోట్లు ఎందుకు తేలేక‌పోతున్నాడు. మోడీ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి లేదా అడ‌గ‌డానికి నోరు రాదా అని ప్రశ్నించారు కేటీఆర్.

పొద్దున లేస్తే బూతులు మాట్లాడటం కాదు, దమ్ముంటే నిధులు తీసుకరా - బండికి కేటీఆర్ సవాల్
X

తనపై పోటీ చేయాలనుకున్నవారు తన కన్నా రెండు మంచి పనులు ఎక్కువ చేస్తే ఓట్లు పడతాయి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని తిడితే ఓట్లు రావని మంత్రి కేటీఆర్ అన్నారు.

మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం వేములవాడ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ స‌భలో ఆయన మాట్లాడుతూ, పొద్దున లేస్తే బూతులు మాట్లాడ‌టం త‌ప్ప బండి సంజయ్ కి మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడితే ప్రజలే మమ్ములను కాపాడుకోవాలని కేటీఆర్ కోరారు. 'మీ ఆశీస్సులు ఉంటే..కేసీఆర్'ను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు.

ప్రతి రోజు ప్రభుత్వాన్ని విమర్శించే బండి సంజయ్ కి దమ్ముంటే, ఆయన నిజంగానే వేముల వాడ రాజన్న భక్తుడే అయితే వేముల‌వాడ అభివృద్దికి కేంద్రం నుంచి రూ. 100 కోట్లు ఎందుకు తేలేక‌పోతున్నాడు. మోడీ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి లేదా అడ‌గ‌డానికి నోరు రాదా అని ప్రశ్నించారు కేటీఆర్. ధ‌ర్మ‌పురి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామికి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యానికి, జోగులాంబ ఆల‌యానికి, భ‌ద్రాద్రి రాముడికి, యాదాద్రికి నిధులు తీసుకురా అని సంజ‌య్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.

కేంద్ర ప్రభుత్వం ఉత్త‌ర కాశీ అభివృద్దికి నిధులు ఇచ్చింది. మ‌రి ద‌క్షిణ కాశీ అయిన వేముల‌వాడ‌కు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు అని ప్ర‌శ్నించారు. వాళ్ళు నిధులు ఇవ్వకపోయినా రాజన్న గుడిని అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.

సిరిసిల్లా కో ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ(CESS) కి జరుగుతున్న ఎన్నికల్లో బారతీయ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ కోరారు. సెస్ పరిధిలో గత ప్రభుత్వాలు 65 ఏళ్ళలో 44 సబ్ స్టేషన్లు నిర్మిస్తే తమ ప్రభుత్వం ఈ 8 ఏళ్ళలోనే కొత్తగా 34 సబ్ స్టేషన్లను నిర్మించిందన్నారు. కొత్తగా మరో ఐదు మంజూరు చేశామ‌ని తెలిపారు.

First Published:  20 Dec 2022 12:10 PM GMT
Next Story