Telugu Global
Telangana

కేటీఆర్ ని ఆశ్చర్య పరచిన 9 ఏళ్ల పిల్లాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..?

మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటైన పార్కులు పచ్చదనానికి, పక్షులకు కేరాఫ్ అడ్రస్ గా మారాయని చెప్పాడు. హైదరాబాద్ పరిధిలో కొత్త పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్ కి ధన్యవాదాలు చెబుతూ ఓ లెటర్ రాశాడు సంహిత్.

కేటీఆర్ ని ఆశ్చర్య పరచిన 9 ఏళ్ల పిల్లాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..?
X

చితజల్లు సంహిత్, వయసు 9 ఏళ్లు. ఈ అబ్బాయిని చూసి మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. తాను ఓ పుస్తకం రాశానని, దాన్ని మీరు ఆవిష్కరించాలని కేటీఆర్ కి ఆ ఆబ్బాయి ఓ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన కేటీఆర్.. అసలా అబ్బాయి ఎవరు, ఏ పుస్తకం రాశాడో తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చారు. తానే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖనుంచి ఆ అబ్బాయికి సహకారం అందించాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని సంహిత్ కి చెప్పారు కేటీఆర్.

ఇంతకీ ఏంటా పుస్తకం..

'వింజ్డ్ ఫ్రెండ్స్' (రెక్కలున్న స్నేహితులు) అనే పేరుతో కేవలం పక్షుల గురించి ఓ పుస్తకాన్ని రాశాడు సంహిత్. హైదరాబాద్ లోని బొటానికల్ గార్డెన్స్ లో కనిపించే పక్షుల ఫొటోలు, వాటి వివరాలు అందులో పొందుపరిచాడు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో పార్కుల అభివృద్ధి జరిగిందని, కేటీఆర్ చొరవతో ఏర్పాటైన పార్కులు పచ్చదనానికి, పక్షులకు కేరాఫ్ అడ్రస్ గా మారాయని చెప్పాడు. హైదరాబాద్ పరిధిలో కొత్త పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్ కి ధన్యవాదాలు చెబుతూ ఓ లెటర్ రాశాడు సంహిత్.


హైదరాబాద్ లో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయా, వాటిని మనం బొటానికల్ గార్డెన్స్ లో చూడొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయాలా ఈ పుస్తకం రూపొందించారు. తానే ఆ పక్షుల ఫొటోలు తీశానని, వాటి గురించి ఇంటర్నెట్ లో వెదికి సమాచారం సేకరించానంటున్నాడు సంహిత్. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తనకు ఉందని చెప్పాడు. కేటీఆర్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరగడం సంతోషంగా ఉందన్నారు సంహిత్.

First Published:  6 April 2023 11:37 AM GMT
Next Story