Telugu Global
Telangana

క్రిషాంక్ అరెస్టు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే.!

గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకే ఈ దౌర్జన్యమన్నారు కేటీఆర్. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

క్రిషాంక్ అరెస్టు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే.!
X

బీఆర్ఎస్ పార్టీ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిషాంక్ అరెస్టుపై స్పందించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్రిషాంక్ అరెస్టు అక్రమం, అన్యాయం, దుర్మార్గమన్నారు. క్రిషాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక, యువతరానికి ప్రతిబింబమని అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకే ఈ దౌర్జన్యమన్నారు కేటీఆర్. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ నియంతృత్వ నిర్బంధాలకు తెలంగాణ ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. నాడు ఎమర్జెన్సీని చూశామన్న కేటీఆర్.. ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీని చూస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే.. రేపు కాంగ్రెస్, బీజేపీలకు పట్టడం ఖాయమన్నారు.


క్రిషాంక్ అరెస్టు ఎందుకంటే.?

ఓయూ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగులు పెట్టి దుష్ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో క్రిషాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి టోల్‌గేట్ దగ్గర క్రిషాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు మఫ్టీలో ఉన్న పోలీసులు. ఐతే ఇప్పటివరకూ క్రిషాంక్‌ను ఎక్కడికి తరలించారన్న దానిపై పోలీసులు సమాచారం ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ వర్గాలతో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

First Published:  1 May 2024 4:28 PM GMT
Next Story