Telugu Global
Telangana

చైనాలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ కు ఆహ్వానం

కేటీఆర్ ను ఆహ్వానిస్తూ లేఖ రాసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే, కేటీఆర్ దార్శనికత కారణంగా, తెలంగాణ అనేక కొత్త ఆవిష్కరణలకు దారితీసిందని, అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలను స్వీకరిస్తూ అగ్రగామిగా మారిందని పేర్కొన్నారు.

చైనాలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ కు ఆహ్వానం
X

జూన్ 27 నుండి 29 వరకు చైనాలో జరగనున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌రవ్వాల‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. చైనాలోని టియాంజిన్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

కేటీఆర్ ను ఆహ్వానిస్తూ లేఖ రాసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే, కేటీఆర్ దార్శనికత కారణంగా, తెలంగాణ అనేక కొత్త ఆవిష్కరణలకు దారితీసిందని, అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలను స్వీకరిస్తూ అగ్రగామిగా మారిందని పేర్కొన్నారు.

“ టి-హబ్ వంటి ఆవిష్కరణల‌ ద్వారా భారతదేశపు స్టార్టప్, ఇన్నోవేషన్ సిస్టమ్‌కు తెలంగాణ నాయకత్వం వహిస్తోంది. ఎంట్ర‌పెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా తెలంగాణలో వృద్ధిని సాధించడంలో మీ అంతర్ దృష్టిని.. మీ నుంచి వినడానికి సమావేశంలో పాల్గొనేవారు ఆసక్తిగా ఉంటారు” అని ఆయన తన ఆహ్వానంలో పేర్కొన్నారు.

వ్యాపారం, ప్రభుత్వం, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు, విద్యాసంస్థలకు చెందిన 1,500 మంది ప్రపంచ నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు.

First Published:  4 May 2023 9:27 AM GMT
Next Story