Telugu Global
Telangana

కరీంనగర్ పసికందు సేఫ్.. మహిళా కిడ్నాపర్‌ ఎలా దొరికిందంటే..

నిందితురాలి పేరు ముక్కెర కవిత. గతంలో ఈమెకు అబార్షన్ అయింది. మళ్లీ పిల్లలు కాలేదు. కానీ ఈమెకు పిల్లలంటే చాలా ఇష్టం. దీంతో ఈమె మైండ్‌లోకి కిడ్నాప్ ఆలోచన వచ్చింది.

కరీంనగర్ పసికందు సేఫ్.. మహిళా కిడ్నాపర్‌ ఎలా దొరికిందంటే..
X

కరీంనగర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో కిడ్నాప్‌కు గురైన 4 రోజుల పసికందును పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 24గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించి, పాపను ఎత్తుకెళ్లిన నిందితురాలిని పట్టుకున్నారు. క‌రీంనగర్ మాతాశిశు కేంద్రం వద్ద తమ 3 రోజుల పసికందును ఎత్తుకెళ్లార‌ని శిశువు తల్లిదండ్రులు ఆదివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వహించారు. కిడ్నాపర్‌తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో పట్టుకున్నారు.

మ్యాటర్‌లోకి వెళ్తే.. నిందితురాలి పేరు ముక్కెర కవిత. గతంలో ఈమెకు అబార్షన్ అయింది. మళ్లీ పిల్లలు కాలేదు. కానీ ఈమెకు పిల్లలంటే చాలా ఇష్టం. దీంతో ఈమె మైండ్‌లోకి కిడ్నాప్ ఆలోచన వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం కరీంనగర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లింది. బాధిత కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడిని మచ్చిక చేసుకుంది. ఎవరకీ అనుమానం రాకుండా బాలుడిని తన వెంట తిప్పుకుని తెలివిగా పాపను కిడ్నాప్ చేసింది.

ఆస్పత్రి ఆవరణలోనే కొద్ది సేపు బాలుడితో కలిసి తిరిగింది. ఆ తర్వాత బ‌స్టాండ్‌కు చేరుకొని అక్కడి నుంచి జమ్మికుంటకు వెళ్లింది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని ఓ గ్రామానికి చేరుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితురాలిని పట్టుకున్నారు. పాపను కరీంనగర్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్మల అనే బిహార్‌ మహిళ 4 రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. నిర్మల దంపతులు కరీంనగర్‌ బావుపేట గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.

First Published:  19 Feb 2024 11:31 AM GMT
Next Story