Telugu Global
Telangana

బెల్జియంలో టెక్‌ యాక్సిలరేటర్‌.. మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కి చెందిన సంస్థ ఇది. దీనికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ‘టెక్‌ యాక్సిలరేటర్‌ 2023 ఫోరం’లో కీలక భాగస్వామిగా పాల్గొనాలని మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందించారు. స్వయంగా టోనీ బ్లెయిర్, కేటీఆర్ కి ఆహ్వాన లేఖ పంపించారు.

బెల్జియంలో టెక్‌ యాక్సిలరేటర్‌.. మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం
X

తెలంగాణలో ఐటీ అభివృద్ధి ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉంది. ఐటీ ఎగుమతుల గణాంకాలు దేశంలోనే తెలంగాణను నెంబర్-1 స్థానంలో నిలబెట్టాయి. అదే సమయంలో అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా తెలంగాణపై పడింది. ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోడానికి పలు అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ డెవలప్ మెంట్ సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సందర్భంలో హైదరాబాద్ లో టెక్నాలజీ అభివృద్ధికి గల కారణాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, భవిష్యత్ అంచనాలను తమ సదస్సులో వివరించాలని కోరుతూ టెక్ యాక్సిలరేటర్ ఫోరం నుంచి మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందింది.

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కి చెందిన సంస్థ ఇది. దీనికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ‘టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ చేంజ్‌’ అనే పేరుతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఈ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే ‘టెక్‌ యాక్సిలరేటర్‌ 2023 ఫోరం’లో కీలక భాగస్వామిగా పాల్గొనాలని మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందించారు. స్వయంగా టోనీ బ్లెయిర్, మంత్రి కేటీఆర్ కి ఆహ్వాన లేఖ పంపించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చ..

అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానం, డేటా వినియోగం ద్వారా ప్రజాసేవలను మెరుగుపరచి, తక్కువ ఖర్చుతో వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు తాము ఒక విజన్‌ ను రూపొందించినట్టు లేఖలో పేర్కొన్నారు టోనీ బ్లెయిర్. ఈ విజన్ పై జరిగే విస్తృత చర్చలో కేటీఆర్ భాగస్వామ్యం కోరుతున్నట్టు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్న మార్పులను భవిష్యత్తుకి అన్వయించి, ఎలాంటి ఉపయోగాలు పొందాలనే విషయంపై రాజకీయ నాయకుల సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజకీయ బృందానికి ఆహ్వానం పంపిస్తున్నామని, అందులో కేటీఆర్ తమకు కీలక భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల కీలక ప్రసంగాలు, గ్రూప్ డిస్కషన్స్, ఈ ఫోరంలో ఉంటాయి.

First Published:  21 Aug 2023 1:31 AM GMT
Next Story