Telugu Global
Telangana

హైదరాబాద్ లో రేవ్ పార్టీ.. సినీ నిర్మాత అరెస్ట్

కేవలం పార్టీల కోసమే అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాదాపూర్ లో విఠల్ రావు నగర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

హైదరాబాద్ లో రేవ్ పార్టీ.. సినీ నిర్మాత అరెస్ట్
X

హైదరాబాద్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నంచేశారు. పక్కా సమాచారంతో మాదాపూర్ లో జరుగుతున్న ఓ రేవ్ పార్టీపై దాడి చేశారు. అర్థరాత్రి మత్తులో తూగేందుకు అన్నీ అరేంజ్ చేసుకునే సరికి సరిగ్గా తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్‌ బ్యూరో (TS-NAB) అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి రేవ్ పార్టీకి వచ్చినవారు షాకయ్యారు, ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

సినీ ఇండస్ట్రీ ప్రమేయం..

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జరుగుతున్న రేవ్ పార్టీల వెనక సినీ ప్రముఖుల హస్తం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం TS-NAB అధికారులు అరెస్ట్ చేసినవారిలో కూడా సినీ ప్రముఖులు ఉన్నారు. ప్రస్తుతానికి నిర్మాత వెంకట్ అనే పేరు మాత్రమే బయటకు వినపడుతోంది. ఆయన సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు యువతులు ఉన్నట్టు తెలుస్తోంది. సినీ అవకాశాల కోసం వారు నిర్మాత ఇచ్చిన పార్టీకి వచ్చారని అంటున్నారు.

అపార్ట్ మెంట్ లో గుట్టుచప్పుడు కాకుండా..

గతంలో రేవ్ పార్టీలు నగరానికి దూరంగా ఫామ్ హౌస్ లలో జరిగేవి. ఫామ్ హౌస్ లో ఆటాపాటా ఉంటే సహజంగానే చుట్టుపక్కలవారికి అనుమానం వస్తుంది, పోలీసులకు ఫోన్లు వెళ్తాయి. దీంతో రేవ్ పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నగరం మధ్యలోకే వచ్చాయి. పాత అపార్ట్ మెంట్లను ఇందుకోసం ఎంపిక చేసుకుంటున్నారు. కేవలం పార్టీల కోసమే అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాదాపూర్ లో విఠల్ రావు నగర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.


First Published:  31 Aug 2023 2:34 AM GMT
Next Story