Telugu Global
Telangana

యాదాద్రికి విజయ్‌ దేవరకొండ.. ఆలయం అద్భుతమంటూ ప్రశంస..!

విజయ్‌ దేవరకొండతో పాటు అతని సోదరుడు బేబీ మూవీ హీరో ఆనంద్ దేవరకొండ, ఖుషీ మూవీ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండకు ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు.

యాదాద్రికి విజయ్‌ దేవరకొండ.. ఆలయం అద్భుతమంటూ ప్రశంస..!
X

యాదాద్రిలో హీరో విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తర్వాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విజయ్‌ దేవరకొండతో పాటు అతని సోదరుడు బేబీ మూవీ హీరో ఆనంద్ దేవరకొండ, ఖుషీ మూవీ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండకు ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదామంత్రాలతో ఆశీర్వ‌దించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు.

స్వామి వారి దర్శనం తర్వాత మాట్లాడిన విజయ్ దేవరకొండ.. యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఆలయం ఇప్పుడు ఎంతో గొప్పగా ఉందన్నారు. ఇక విజయ్‌ దేవరకొండను చూసేందుకు స్థానికులు, భక్తులు ఎగబడ్డారు. సెల్ఫీలు దిగారు.

విజయ్‌ దేవరకొండ, సమంత నటించిన ఖుషీ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీస్‌ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్‌ ఒకటిన విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో అదరగొడుతోంది.


First Published:  3 Sep 2023 1:02 PM GMT
Next Story