Telugu Global
Telangana

భయం అక్కర్లేదు.. భవిష్యత్తు మనదే - హరీష్‌ రావు

తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వాటి స్వార్థం కోసం పనిచేస్తాయన్న హరీష్‌ రావు.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.

భయం అక్కర్లేదు.. భవిష్యత్తు మనదే - హరీష్‌ రావు
X

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో అసహనం పెరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్‌ రావు.. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ఓటమి శాశ్వతం కాదని.. గెలుపున‌కు నాంది అన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని.. రైతుబంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలని మాట్లాడడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌పై కాంగ్రెస్‌ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు.

ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్‌ అపాయింట్‌మెంట్ లెటర్లు మాత్రమే ఇచ్చిందన్నారు. దళితబంధుకు మంజూరైన నిధులను బ్యాంకుల్లో కాంగ్రెస్ ఫ్రీజ్‌ చేసిందన్నారు. కార్యకర్తలు కష్టపడితే భువనగిరి ఎంపీ సీటు బీఆర్ఎస్‌దేనన్నారు హరీష్‌ రావు.

తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వాటి స్వార్థం కోసం పనిచేస్తాయన్న హరీష్‌ రావు.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కర్ణాటక ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారని.. అక్కడ 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 4-5 సీట్లు మాత్రమే గెలుస్తుందన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందన్నారు. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తు బీఆర్ఎస్‌దేనన్నారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా బీఆర్ఎస్‌ది ప్రజల పక్షమేనన్నారు హరీష్‌ రావు.

First Published:  2 Feb 2024 12:06 PM GMT
Next Story