Telugu Global
Telangana

ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్..

హైదరాబాద్ నగరం ఆ యువకుడికి కొత్తేమీ కాకపోయినా.. గూగుల్ మ్యాప్ సాయంతో బైక్ లో రోడ్డుపైకి వచ్చాడు. రాంగ్ రూట్ లోకి వెళ్లాడు.

ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్..
X

గూగుల్ మ్యాప్ దారి చూపిస్తుంది, మన గమ్యాన్ని త్వరగా చేరుకునేందుకు సాయపడుతుంది. అయితే గూగుల్ మ్యాప్ ని గుడ్డిగా ఫాలో అయితే లేనిపోని ఇబ్బందులు కూడా వస్తాయి. గూగుల్ మ్యాప్ సాయంతో డ్రైవ్ చేస్తూ తప్పుదారిలో వెళ్లి నేరుగా చెరువులోనో, కాల్వలోనే పడిపోయినవారు కూడా ఉన్నారు. ప్రమాదం వరకు ఓకే, కానీ హైదరాబాద్ లో ఓ యువకుడి ప్రాణాలే పోయాయి. కారణం గూగుల్ మ్యాప్ రాంగ్ డైరెక్షన్స్ అని పోలీసులు నిర్థారించారు.

మెహిదీపట్నం-శంషాబాద్‌ వరకు 11.6 కిలోమీటర్ల మేర పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పై కార్లు, బస్సులకు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంది. కానీ.. ఈ మార్గంలో రాత్రి బైక్ పై వెళ్లిన ఓ యువకుడు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యాడు. అతడితోపాటు బైక్ పై ఉన్న ఇద్దరు యువతులు చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గూగుల్ మ్యాప్ తో రాంగ్ డైరెక్షన్ లో వెళ్లిన ఆ యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

మెహిదీపట్నం-శంషాబాద్‌ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో పిల్లర్‌ నెంబరు 84 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్ అనే 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నగరం ఆ యువకుడికి కొత్తేమీ కాకపోయినా.. గూగుల్ మ్యాప్ సాయంతో బైక్ లో రోడ్డుపైకి వచ్చాడు. రాంగ్ రూట్ లోకి వెళ్లాడు. కంగారులో దారి మార్చుకునేందుకు, అనుమతి లేదని తెలిసి కూడా పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే లోకి వచ్చాడు. కారు ఢీకొని చనిపోయాడు.

First Published:  15 May 2023 7:32 AM GMT
Next Story