Telugu Global
Telangana

Gold ATM in Hyderabad: దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో..

బ్యాంకులు పెట్టే ఏటీఎంల నుంచి ఎనీ టైమ్ మనీ తీసుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ ఏటీఎంల నుంచి మార్కెట్ టైమ్ లో మాత్రమే బంగారు నాణేలను తీసుకోవాల్సి ఉంటుంది.

Gold ATM in Hyderabad: దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో..
X

Gold ATM in Hyderabad: దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో..

ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు తీసుకోవచ్చు. కానీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ ఏటీఎం నుంచి బంగారు నాణేలను బయటకు తీయొచ్చు. బంగారం ధర చెల్లించిన వెంటనే ఆ ఏటీఎం నుంచి నాణేలు బయటకు వస్తాయి. దేశంలోనే ఇలాంటి తొలి గోల్డ్ ఏటీఎంని హైదరాబాద్ లో ప్రారంభించారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్ లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీ¬తా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

గోల్డ్ ఏటీఎం ప్రత్యేకతలివే..

ఈ గోల్డ్‌ ఏటీఎం ద్వారా 99.99 శాతం స్వచ్ఛత కలిగిన బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చు. 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బరువుల్లో ఈ నాణేలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు డెబిట్, క్రెడిట్‌ కార్డులతో గోల్డ్ సిక్కా సంస్థ ప్రత్యేకంగా ప్రీపెయిడ్‌ కార్డులను కూడా జారీ చేస్తోంది. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల బంగారు కాయిన్స్ ని నింపి ఉంచుతారు.

గోల్డ్ ఏటీఎం పనివేళలు..

బ్యాంకులు పెట్టే ఏటీఎంల నుంచి ఎనీ టైమ్ మనీ తీసుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ ఏటీఎంల నుంచి మార్కెట్ టైమ్ లో మాత్రమే బంగారు నాణేలను తీసుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో గోల్డ్‌ మార్కెట్‌ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్‌ తీసుకోవచ్చని తెలిపారు నిర్వాహకులు. త్వరలోనే ఎయిర్‌ పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్, పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌ లలో కూడా గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభిస్తామన్నారు. రాబోయే రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించబోతున్నట్టు గోల్డ్ సిక్కా సంస్థ ప్రతినిధులు చెప్పారు.

First Published:  4 Dec 2022 2:41 AM GMT
Next Story