Telugu Global
Telangana

కేసీఆర్ కే మా ఓటు.. గజ్వేల్ మైనార్టీల సెల్ఫ్ డిక్లరేషన్

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేతకు మరోసారి గజ్వేల్‌ లో భారీ మెజార్టీ వచ్చేలా పనిచేస్తామని అన్నారు మైనార్టీ నేతలు. గజ్వేల్‌ పట్టణంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

కేసీఆర్ కే మా ఓటు.. గజ్వేల్ మైనార్టీల సెల్ఫ్ డిక్లరేషన్
X

సీఎం కేసీఆర్ కి ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమంటున్నారు గజ్వేల్ నియోజకవర్గ మైనార్టీలు. కేసీఆర్ కే మా ఓటు అంటూ వాళ్లు తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని మంత్రి హరీష్ రావుకి అందించారు. కేసీఆర్ వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని, తమ నియోజకవర్గంలోని మైనార్టీలంతా ఆయనకు ఏకపక్షంగా మద్దతిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేతకు మరోసారి గజ్వేల్‌ లో భారీ మెజార్టీ వచ్చేలా పనిచేస్తామని అన్నారు మైనార్టీ నేతలు. గజ్వేల్‌ పట్టణంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షాదీముబారక్‌ సాయం అందుతోందన్నారు. గజ్వేల్‌ లో షాదీఖాన నిర్మాణం, మదీనా మసీద్‌ వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేసుకున్నామని, ప్రభుత్వ సాయాన్ని తామెప్పుడూ మరచిపోలేమన్నారు. ముస్లింల సంక్షేమం కోసం తపిస్తున్న కేసీఆర్‌ మరోసారి తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

ముస్లింలకు కేసీఆర్ ప్రభుత్వం సాయం అందిస్తుంటే బీజేపీకి అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నిస్తున్నారు మైనార్టీ నేతలు. ముస్లిం దోభీఘాట్, లాండ్రీ షాపులకు విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం రాయితీ ఇవ్వడాన్ని వారు స్వాగతించారు. తమకు మేలుచేసే నిర్ణయాలపై కూడా బీజేపీ నేతలు ఓర్వలేని తనంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమంటున్నారు మైనార్టీ నేతలు.


First Published:  21 Sep 2023 1:18 AM GMT
Next Story