Telugu Global
Telangana

మహాబోధిలో అంత్యక్రియలు.. మధ్యాహ్నం గద్దర్ అంతిమయాత్ర

మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఆల్వాల్‌ లోని భూదేవినగర్‌ లో గద్దర్‌ నివాసం వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌ మీదుగా అంతిమయాత్ర సాగుతుంది

మహాబోధిలో అంత్యక్రియలు.. మధ్యాహ్నం గద్దర్ అంతిమయాత్ర
X

ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతాయి. గద్దర్ కోరిక మేరకు ఆల్వాల్ లో ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయం మైదానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంత్రి కేటీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఆల్వాల్‌ లోని భూదేవినగర్‌ లో గద్దర్‌ నివాసం వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌ మీదుగా అంతిమయాత్ర సాగుతుంది. ఆయన ఇంటి వద్ద ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆల్వాల్‌ లోనే గద్దర్‌ స్థాపించిన మహాబోధి విద్యాలయం మైదానంలో అంత్యక్రియలు చేస్తారు.

గద్దర్ మృతికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాలు పంపించారు. ఈరోజు చివరి చూపుకోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు, ఇతర ప్రముఖులు, ఆయన అభిమానులు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటున్నారు. గద్దర్ స్వగ్రామం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ లోని పాత హైవే రోడ్డు వెంట ఉన్న గద్దర్‌ ఇంటి వద్దకు కూడా గ్రామస్థులు, అభిమానులు వచ్చి చూసిపోతున్నారు. ఇటు ఆల్వాల్ లోని నివాసం వద్ద కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. గద్దర్ పార్థివ దేహాన్ని ఇంటివద్దకు తెచ్చే సమయం కోసం అక్కడ చాలామంది వేచి చూస్తున్నారు. గద్దర్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఆయన అభిమానులు తరలి వస్తున్నారు.

First Published:  7 Aug 2023 3:08 AM GMT
Next Story