Telugu Global
Telangana

RRR మూవీ పేరుతో మోసం... 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల నుండి 6 కోట్ల లూటీ!

RRR మూవీతో సహా పలు సినిమాలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఇద్దరు చీటర్స్ 30 మంది సాఫ్ట్ ఇంజనీర్లను 6 కోట్ల మేర మోసం చేశారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RRR మూవీ పేరుతో మోసం... 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల నుండి 6 కోట్ల లూటీ!
X

మోసగాళ్ళు మోసాలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త కొత్త మోసాలతో ప్రజలను బుట్టలో వేసుకుంటున్నారు. సినిమాల్లో పెట్టుబడులు పెడతామంటూ కొందరు మోసగాళ్ళు 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దగ్గర 6 కోట్ల రూపాయలను దోచుకున్నారు. హైదరాబాద్ కూకట్ ప‌ల్లి కి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ లు ఈ మోసాలకు పాల్పడ్డారు.

RRR, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది తదితర పలు సినిమాలలో పెట్టుబడుల పెడితే అధిక లాభాలు ఇస్తామని 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను నమ్మించిన అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ లు దాదాపు 6 కోట్ల రూపాయలకు పైగానే దోచుకున్నారు. ఈ నేరాల్లో కొంగర అంజమ్మ చౌదరి కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్ లు కూడా ఈ మోసగాళ్ళకు సహకరించినట్టు బాధితులు చెప్తున్నారు.

ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాక రియల్ ఎస్టేట్, బొర్వెల్స్ తదితర‌ రంగాలలో కూడా పెట్టుబడులు పెడతామంటూ చెప్పి వీరు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ మోసాలకు వారు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారు. డబ్బులు తిరిగి అడిగినవారిని మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరించారు.

బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఈ రోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

కాగా ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First Published:  14 Oct 2022 12:22 PM GMT
Next Story