Telugu Global
Telangana

డ్ర‌గ్స్ ముఠా గుట్టుర‌ట్టు.. - రూ.1.33 కోట్ల కొకైన్ స్వాధీనం

నైజీరియాకు చెందిన పెటి ఎబుజ‌ర్ (35) స‌హాయంతో న‌గ‌రంలో కొకైన్ విక్ర‌యించేవాడు. ఒక గ్రాము కొకైన్ రూ.15 వేల నుంచి రూ.18 వేల‌కు విక్ర‌యించేవాడు.

డ్ర‌గ్స్ ముఠా గుట్టుర‌ట్టు.. - రూ.1.33 కోట్ల కొకైన్ స్వాధీనం
X

నాలుగేళ్లుగా డ్ర‌గ్స్ దందా నిర్వ‌హిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియ‌న్‌తో పాటు ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోటీ 33 ల‌క్ష‌ల విలువైన 303 గ్రాముల కొకైన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర ఈ విష‌యాన్ని శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు.

నిందితుడు చింతా రాకేష్ రోష‌న్ (35) స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా తాడేప‌ల్లి. అత‌ను ఫిలింన‌గ‌ర్‌లో డ్రైఫ్రూట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారం స‌రిగా లేక భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో వ్యాపారం మానేశాడు. ఈ నేప‌థ్యంలో గోవా వెళ్లిన అత‌ను అక్క‌డ కొకైన్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత దానికి బానిసైన రోష‌న్‌.. డ‌బ్బు కోసం కొకైన్ స‌ర‌ఫ‌రాకు నిర్ణ‌యించుకున్నాడు.

నైజీరియాకు చెందిన పెటి ఎబుజ‌ర్ (35) స‌హాయంతో న‌గ‌రంలో కొకైన్ విక్ర‌యించేవాడు. ఒక గ్రాము కొకైన్ రూ.15 వేల నుంచి రూ.18 వేల‌కు విక్ర‌యించేవాడు. వ్యాపారం పెంచేందుకు వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాడు. గ‌జ్జెల శ్రీ‌నివాస్‌రెడ్డి (38), సూర్య‌ప్ర‌కాశ్ (26)ల‌ను త‌న ఏజెంట్లుగా నియ‌మించుకున్నాడు. గోవా నుంచి వారి ద్వారా డ్ర‌గ్స్ తెప్పించేవాడు. ఇదే క్ర‌మంలో స‌రుకు స‌ర‌ఫ‌రా చేసే గాబ్రియేల్ త‌న బాధ్య‌త‌ను విక్ట‌ర్ చుక్వా (22) అనే వ్య‌క్తికి అప్ప‌గించాడు. అప్ప‌టినుంచి విక్ట‌ర్ వ‌ద్దే ఈ ముగ్గురూ డ్ర‌గ్స్ కొనుగోలు చేసేవారు.

సూర్య‌ప్ర‌కాశ్ ప‌ట్టుబ‌డ‌టంతో..

ఈ నెల 2వ‌ తేదీన గోవా నుంచి 23 గ్రాముల కొకైన్‌తో వ‌స్తున్న సూర్య‌ప్ర‌కాశ్ ను రాయ‌దుర్గం, మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ను అందించిన స‌మాచారంతో ఈ నెల 5న 100 గ్రాముల కొకైన్‌తో ఉన్న డేవిడ్ త‌దిత‌ర నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

First Published:  7 May 2023 2:20 AM GMT
Next Story