Telugu Global
Telangana

పొన్నం వర్సెస్ శ్రీధర్‌ బాబు.. నామినేటెడ్‌ పదవుల చిచ్చు

గతంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తనను ఓడించేందుకు ప్రయత్నాలు చేశారని.. అలాంటి వ్యక్తికి పదవి ఎలా ఇస్తారంటూ పొన్నం ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పొన్నం వర్సెస్ శ్రీధర్‌ బాబు.. నామినేటెడ్‌ పదవుల చిచ్చు
X

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. నామినేటెడ్ పదవుల అంశం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబుల మధ్య చిచ్చుపెట్టింది. నామినేటెడ్‌ పదవులన్ని శ్రీధర్‌బాబు వర్గానికే దక్కాయని పొన్నం ప్రభాకర్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పొన్నం ప్రభాకర్‌ అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు సమాచారం.

ఇటీవల ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమించిన విషయం తెలిసిందే. శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను ప్ర‌భుత్వం నియమించింది. అయితే ఈ ఇద్దరు శ్రీధర్‌ బాబు కోటరి కావడంతో పొన్నం అలకబూనినట్లు సమాచారం.

గతంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తనను ఓడించేందుకు ప్రయత్నాలు చేశారని.. అలాంటి వ్యక్తికి పదవి ఎలా ఇస్తారంటూ పొన్నం ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శ్రీధర్‌ బాబుల పెత్తనంపైనా పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పొన్నం ప్రభాకర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

First Published:  21 March 2024 10:13 AM GMT
Next Story